ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:27 AM

స్థల వివాదంలో ఒక వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన కేసులో ఇద్దరు నిందితులకు జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ. భారతి జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధించారు.

మద్దిపాడు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): స్థల వివాదంలో ఒక వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన కేసులో ఇద్దరు నిందితులకు జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ. భారతి జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధించారు. మద్దిపాడు ఎస్‌ఐ బి. శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన గొ ట్టిపాటి రామారావు అతని సమీప బంధువులైన నల్లూరి వెంకటరావు కుటుం బ సభ్యులకు నాలుగు గదుల ఖాళీ స్థలం గురించి వివాదం నెలకొంది. దీంతో వెంకటరావు కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని 2018 అక్టోబరు, 1వ తేదీన రామారావు తన స్థలంలో కూరగాయల మొక్కలకు పందిరి వేస్తుండగా నల్లూ రి వెంకట్రావు, నల్లూరి సురేష్‌, నల్లూరి రాజ్యలక్ష్మి అతనిపై కర్రలతో దాడి చేసి గాయపర్చారు. దీంతో ఒంగోలులో చికిత్స పొందుతూ అతను అక్టోబరు 3వ తేదీన మరణించగా అప్పటి మద్దిపాడు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయాధికారి నిందితులు నల్లూరి వెంకట్రావు, సు రేష్‌లకు జీవిత ఖైదు, జరిమానా విధించారు. కాగా రాజ్యలక్ష్మిపై నేరం రుజువు కాకపోవడంతో ఆమెపై కేసు కొట్టివేశారు.

Updated Date - Apr 17 , 2025 | 12:27 AM