ఎంఎస్‌ఎంఈ పార్కు వరం
ABN, Publish Date - May 08 , 2025 | 01:45 AM
మండలంలోని కలుజువ్వలపాడు ఇలాకా మేకలవారిపల్లి టోల్‌గేట్ వద్ద ఎంఎ్‌సఎంఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయడం నియోజకవర్గానికి వరం అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 50 ఎకరాల్లో ఏర్పాటవు తున్న ఈ పార్కుకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.
పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు
మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మేకలవారిపల్లి టోల్‌గేట్ సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన
తర్లుపాడు, మే 7 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కలుజువ్వలపాడు ఇలాకా మేకలవారిపల్లి టోల్‌గేట్ వద్ద ఎంఎ్‌సఎంఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయడం నియోజకవర్గానికి వరం అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 50 ఎకరాల్లో ఏర్పాటవు తున్న ఈ పార్కుకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కాపురం ఎస్టేట్‌లో ఏవిధంగా ఏర్పాటు చేశారో అలాగే ఇక్కడ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటువల్ల నిరుద్యోగులకు వందల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నియోజకవర్గంలోని కొనకనమిట్లలో రిలయన్స్ ఆధ్వర్యంలో రూ.1,500కోట్లతో త్వరలో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. రైతులకు ఎకరానికి రూ.30వేలు కౌలు చెల్లిస్తారని చెప్పారు. ఆ ప్లాంట్ ద్వారా కూడా వందల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇక్కడి నుంచి రామాయపట్నంకు 100కి.మీ, ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ దూరంలో ఉన్నాయన్న ఎమ్మెల్యే.. ఈ ప్రాజెక్టులు కూడా జాతీయ రహదారి పక్కనే ఉన్నందున పారిశ్రామిక వాడల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్‌మోహన్, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, గ్రామ సర్పంచ్ ముండ్లపాటి శిఖామణి, టీడీపీ నాయకులు, మాజీ ఎంపీపీ పులివేముల ఏసుదాసు, మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, పి.గోపీనాథ్ చౌదరి, కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 01:47 AM