లక్ష్మీనరసింహస్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ABN, Publish Date - May 11 , 2025 | 11:34 PM
పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న తిరునాళ్ల బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దంపతులు ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గిద్దలూరు టౌన్, మే 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న తిరునాళ్ల బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దంపతులు ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, దేవస్థాన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
కొమరోలు : నియోజకవర్గ ప్రజలపై సాయిబాబా కృప ఉండాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని రెడ్డిచర్ల శ్రీ షిరిడీ సాయిబాబ ఆలయ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగలు, కార్యక్రమాలను కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాలని, తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడాలని అశోక్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముత్తుముల సంజీవరెడ్డి, ఆలయ ధర్మకర్త రెడ్డిచెర్ల వెంకంరాజు, నాయకులు చలిచీమల శ్రీనివాసచౌదరి, మస్తాన్‌వలి, హెసేన్ బేగ్, అక్కలరెడ్డి మోహన్‌రెడ్డి, ఖాశింవలి, అక్కలరెడ్డి రాజారెడ్డి, రఘురామరాజు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:34 PM