ఏబీవీపీ నిరసనలో స్వల్ప ఉద్రిక్తత
ABN, Publish Date - May 07 , 2025 | 12:28 AM
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో నిర్వహించిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. జీవో నంబర్ 77ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు
ఒంగోలు కలెక్టరేట్, మే 6 (ఆంధ్రజ్యోతి) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో నిర్వహించిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. జీవో నంబర్ 77ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నెల్లూరు విభాగ్ కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ 77 జీవోను రద్దు చేయకుండానే ఈనెల 7న ఐసెట్ పరీక్షలు నిర్వహించడం తగదన్నారు. గత ఎన్నికలకు ముందు లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఆ ఉత్తర్వులను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 12:28 AM