తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి
ABN, Publish Date - May 21 , 2025 | 12:03 AM
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల డ్రైవర్లుగా పనిచే స్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని ప లువురు కోరారు. ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లా యీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
యూనియన్ నాయకుల డిమాండ్
ఒంగోలు కలెక్టరేట్, మే 20 (ఆంధ్రజ్యోతి) : తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల డ్రైవర్లుగా పనిచే స్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని ప లువురు కోరారు. ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లా యీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు జీవీ.కొండారెడ్డి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లాకార్యదర్శి పెం ట్యాల కల్పన ధర్నాకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ కేవలం రూ.7,870 వేతనంతో గత తొమ్మిదేళ్లుగా పని చేస్తున్న వాహనడ్రైవర్లకు కనీస వేతనాలు అ మలు చేయడం లేదన్నారు. వైద్యఆరోగ్యశాఖలో నిరంతరం పనిచేస్తున్న వాహన డ్రైవర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానం పేరుతో వెట్టిచాకిరి చేపిస్తున్నారని మండిప డ్డారు. కనీస వేతనం రూ.26వేలు అమలు చే యాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి వెంకటేశ్వర్లు, నాయ కులు భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:03 AM