నేడు కనిగిరిలో మినీ మహానాడు
ABN, Publish Date - May 18 , 2025 | 10:32 PM
కనిగిరిలో సోమ వారం మినీ మహానాడు జరుగనుంది. కనిగిరి - కం దుకూరు రోడ్డు మార్గంలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాలులో నిర్వహణకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసిం హారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లుచేశారు.
కనిగిరి, మే 18 (ఆంధ్రజ్యోతి): కనిగిరిలో సోమ వారం మినీ మహానాడు జరుగనుంది. కనిగిరి - కం దుకూరు రోడ్డు మార్గంలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాలులో నిర్వహణకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసిం హారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లుచేశారు. కార్యక్రమా నికి వచ్చేందుకు నియోజకవర్గంలోని ఆరుమండలాల నుంచి నాయకులు శ్రేణులను సమాయత్తం చేశారు. పార్టీ రాష్ట్రనాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో మినీ మహానాడు ఏర్పాటు జరుగు తుండగా కనిగిరిలో జరిగే కార్యక్రమం హైలెట్‌గా నిలవనుందని ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఏర్పాట్ల విషయంలో ఎమ్మెల్యే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
దర్శిలో..
దర్శి, మే 18(ఆంధ్రజ్యోతి): దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో గల పీటీఎస్ కల్యాణ మండపంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలి పారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీ డీపీ జిల్లా అధ్యక్షుడు నూక సాని బాలాజీ, రాష్ట్ర వ్యవసా య మిషన్ చైర్మెన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదిత రులు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Updated Date - May 18 , 2025 | 10:32 PM