ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

ABN, Publish Date - May 15 , 2025 | 11:07 PM

మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని శంఖవరం గ్రామం వద్ద జరుగుతున్న సాగర్‌ నీటి పైపుల మరమ్మతు పనులను గురువారం ఆయన పరిశీలించారు.

పైపుల మరమ్మతు పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మే 15 (ఆంధ్రజ్యోతి): మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని శంఖవరం గ్రామం వద్ద జరుగుతున్న సాగర్‌ నీటి పైపుల మరమ్మతు పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ గత పదేళ్ళుగా సాగర్‌ నీటిసరఫరా పైపులు మరమ్మతులకు గురై తరచూ నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. మరమ్మతులకు గురైన పైపుల స్థానంలో నాణ్యమైన పైపులు, సామగ్రిని వినియోగించాలని నీటి సరఫరా శాఖాధికారులు, సిబ్బందికి సూచించారు. రోడ్డు వెంట వేస్తున్న నీటి సరఫరా పైపులు వాహనాలవల్ల ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా లోతుగా వేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 11:08 PM