తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
ABN, Publish Date - May 05 , 2025 | 10:05 PM
ప ట్టణ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. 32వ వార్డులో ని చర్చి వద్ద సోమవారం నూతన డీప్‌బోర్ పనులను ఆయన ప్రారంభించారు.
32వ వార్డులో డీప్ బోర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, మే 5 (ఆంధ్రజ్యోతి): ప ట్టణ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. 32వ వార్డులో ని చర్చి వద్ద సోమవారం నూతన డీప్‌బోర్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శివారు కాలనీల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆయా ప్రాం తాల్లో అవకాశం ఉన్న మేరకు నూతన డీప్‌బోర్లు వేయిస్తామన్నారు. అంతేకాక ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న పలు సమస్యలను మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, షేక్ మౌళాలి, కౌన్సిలర్లు నాలి కొండయ్య యాదవ్, చిన్నషెక్షావలి, పఠాన్ హుసేన్‌ఖాన్ పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2025 | 10:05 PM