ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చీరాల పట్టణంలో భారీ చోరీ

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:07 AM

చీరాల పట్టణంలోని పువ్వాడ వారివాధిలో భారీ చోరీ జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన మువ్వల శివప్రసాదరావు, భార్య పద్మావతితో కలిసి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి మంగళవారం రాత్రి వెళ్లారు.

ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోపు 120 సవర్ల బంగారు మాయం

చీరాల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : చీరాల పట్టణంలోని పువ్వాడ వారివాధిలో భారీ చోరీ జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన మువ్వల శివప్రసాదరావు, భార్య పద్మావతితో కలిసి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి మంగళవారం రాత్రి వెళ్లారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగించుకున్న అనంతరం ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు శివప్రసాదరావు దంపతులు గుర్తించారు. ఇల్లంతా కారం చల్లి ఉంది. దొంగలు ఇంటి తాళం పగులకొట్టి లోపలకు ప్రవేశించి బీరువాలో ఉన్న 120 సవర్ల బంగారంతోపాటు రూ.1.60 వేలు నగదు కూడా దొంగలు చోరీ చేశారు. వారు వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌ టీంతో వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో వీరి వద్ద పనిచేసిన ఎలక్ర్టీషియన్‌ మరో వ్యక్తితో వచ్చి ఇంటి పరిసరాలలో అనుమానాస్పదంగా సంచరించి వెళ్లారు. అనుమానితుల్లో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Updated Date - Apr 30 , 2025 | 12:07 AM