ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాతపాడులో వ్యక్తి హత్య..?

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:47 PM

ఒంగోలు రూరల్‌ మండలం పాతపాడు గ్రామానికి చెందిన మూరబోయిన అర్జున్‌రెడ్డి(55) అదృశ్యం గ్రామంలో కలకలం రేపుతోంది. పదిహేను రోజులుగా ఆయన కనిపించడం లేదు. ఈ మేరకు గత నెల 29న ఆయన సోదరుడు వెంకటేశ్వరరెడ్డి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు

15 రోజులుగా కనిపించని అర్జున్‌రెడ్డి

అదే రోజు నుంచి మృతుడి భార్య, మరొకరు గ్రామం నుంచి పరారీ

మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు

ఒంగోలు క్రైం, ఏప్రిల్‌1 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు రూరల్‌ మండలం పాతపాడు గ్రామానికి చెందిన మూరబోయిన అర్జున్‌రెడ్డి(55) అదృశ్యం గ్రామంలో కలకలం రేపుతోంది. పదిహేను రోజులుగా ఆయన కనిపించడం లేదు. ఈ మేరకు గత నెల 29న ఆయన సోదరుడు వెంకటేశ్వరరెడ్డి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన సోదరుడు అర్జున్‌రెడ్డి గత నెల 19వ తేదీ నుంచే కనింపించడం లేదని అందులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతపాడులో మాత్రం అర్జున్‌రెడ్డి హత్యకు గురై ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అదేక్రమంలో ఆయన భార్య పరారీలో ఉండటంతో అర్జున్‌రెడ్డిని హత్య చేశారా అనే అనుమానాలకు ఊతం ఇస్తోంది. అంతేగాకుండా కనీసం తన భర్త కనిపించడం లేదని ఆమె తన కుటుంబసభ్యులతో కానీ, కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గ్రామం వదిలి వెళ్లడం అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. వివాహేతర సంబంధం వల్ల హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన రమే్‌షరెడ్డితో అర్జున్‌రెడ్డి భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అర్జున్‌రెడ్డి కనిపించని రోజు నుంచి రమే్‌షరెడ్డి కూడా ఊరు వదిలి వెళ్లాడని నిర్ధారణకు వచ్చారు. రమే్‌షరెడ్డి 2012లో తన భార్యను హత్య చేసి రిమాండ్‌ ఖైదీగా జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది. ఈక్రమంలో అర్జున్‌రెడ్డిని కూడా హత్య చేశారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు మాత్రం రమే్‌షరెడ్డి, అర్జున్‌రెడ్డి భార్యను అదుపులోకి తీసుకొని గోప్యంగా విచారిస్తునట్లు తెలిసింది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే అర్జున్‌రెడ్డిని హత్య చేసి పూడ్చి వేశారనే వదంతులు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Updated Date - Apr 01 , 2025 | 11:47 PM