ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహానాడును జయప్రదం చేయండి

ABN, Publish Date - May 25 , 2025 | 10:42 PM

కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 5000 ఐదు వేలకు పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి జయప్రదం చేయాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

శ్రేణులకు టీడీపీ ఇన్‌చార్జి

ఎరిక్షన్‌బాబు పిలుపు

ఎర్రగొండపాలెం, మే 25 (ఆంధ్రజ్యోతి) : కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 5000 ఐదు వేలకు పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి జయప్రదం చేయాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పంచాయతీ నుంచి ఒక బస్సు కడపకు బయలుదేరుతుందని చెప్పారు. గతంలో ఒంగోలులో జరిగిన మహానాడుకు ఇక్కడి నుంచి భారీగా తరలివెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. చి త్తూరు జిల్లా టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్‌రెడ్డి ప్రజలను మభ్యపెట్టే మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే ఎమ్మెల్సీలు, ఎం పీపీలు, సర్పంచ్‌లను ఎంఎల్‌సీ, ఎంపీపీలు, సర్పంచులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భారీ సంఖ్యలో తరలివెళ్లి మహానాడును జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, ఐదు మండలాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం రాజన్‌, ఎరిక్షన్‌బాబును సన్మానించారు.

Updated Date - May 25 , 2025 | 10:42 PM