మేదరమెట్లలో భారీ అగ్నిప్రమాదం
ABN, Publish Date - Jun 04 , 2025 | 11:15 PM
షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం చోటుకుంది. మంగళవారం అర్ధరాత్రి మేదరమెట్ల సెంటర్‌లోని పుస్తకాలు, బ్యాగులు, ఫ్యాన్సీ వస్తువులు అమ్మే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కాలిపోయాయి.
రూ.40లక్షల ఆస్తినష్టం
మేదరమెట్ల, జూన్ 4(సెప్టెంబరు): షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం చోటుకుంది. మంగళవారం అర్ధరాత్రి మేదరమెట్ల సెంటర్‌లోని పుస్తకాలు, బ్యాగులు, ఫ్యాన్సీ వస్తువులు అమ్మే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కాలిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున దుకాణ యజమాని పి. వాసు పెద్ద ఎత్తున పుస్తకాలు, బ్యాగులు, ఇతర వస్తువులు తెప్పించి నిల్వ చేశారు. ప్రతిరోజు అక్కడే నిద్రించే అతను మంగళవారం మాత్రం తాళం వేసి ఇంటికి వెళ్లారు. అయితే అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ మంటలు రేగగా వాటిని చూసిన స్థానికులు వాసుకు సమాచారం అందించారు. అతను వెంటనే అద్దంకి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు తన సిబ్బందితో వచ్చి నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. చుట్టుపక్కల గృహాల వారు ఈ ప్రమాదంతో భయకంపితులయ్యారు. ఫైరింజన్ సకాలంలో రావడంతో ఊపరిపీల్చుకున్నారు. బుధవారం పగలంతా కూడా పొగలు వస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికులు ట్రాక్టర్ ట్యాంకర్‌తో నీళ్లు తెప్పించి దుకాణంలో చల్లారు. ఈ ఘటనలో వాసు పెంపుడు కుక్కలు లోపలే ఉండగా అవి తెలివిగా బాత్రూంలో దాక్కోవడంతో ప్రమదం నుంచి బయటపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేసి వాటిని కాపాడారు. షాపులో దాదాపు రూ.40లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాసు తెలిపారు.
Updated Date - Jun 04 , 2025 | 11:15 PM