ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పర్చూరు - ఇంకొల్లు రోడ్డుకు మహర్దశ

ABN, Publish Date - May 25 , 2025 | 11:56 PM

పర్చూరు - ఇంకొల్లు (పాతమద్రాసు) రోడ్డుకు గ్రహణం వీడ నుంది. గత వైసీపీ పాలనలో కనీస మరమ్మతులకు కూడా నోచుకోని ఈ రోడ్డు ప్రమాదభరితంగా మారిం ది.

పర్చూరు, మే 25 (ఆంధ్ర జ్యోతి) : పర్చూరు - ఇంకొల్లు (పాతమద్రాసు) రోడ్డుకు గ్రహణం వీడ నుంది. గత వైసీపీ పాలనలో కనీస మరమ్మతులకు కూడా నోచుకోని ఈ రోడ్డు ప్రమాదభరితంగా మారిం ది. దీంతో ఈ రోడ్డులో ప్రయాణాలు సాగించాలంటే ప్రజలు ప్రాణాలు అరిచేతులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో రోడ్డు దుస్థితి చూసిన ఎమ్మె ల్యే సాంబశివరావు స్పందించారు. రోడ్డు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి దుష్టికి సమస్యను పలుమా ర్లు తీసుకుపోయారు. సమస్య దీంతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వు లు జారీచేసింది. రోడ్డు నిర్మాణానికి రూ.23.88 కోట్లు మంజూరు చేసింది. పర్చూరు - ఇంకొల్లు కిలోమీటర్లు 0/375 నుండి 19/680 వరకు రోడ్డు విస్తరణతో పాటు రోడ్డును పటిష్టం చేయాలని, వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీచేసింది. దీంతో ప్రజల రహదారి సమస్యకు పరిష్కారం దొరికినట్లు అయ్యింది. రోడ్డు దుస్థితి చిత్రాలతో పాటు అధికారుల తయారుచేసిన ప్రతిపాదనలను మంత్రి జనార్థనరెడ్డికి వివరించి నిధులు రాబట్టడంలో ఎమ్మెల్యే సఫలీకృ తమయ్యారు. సమస్యపై స్పందించి నిధులు మంజూ రు చేయించడంతో ఎమ్మెల్యే ఏలూరిని పలువురు అభినందిస్తున్నారు.

వైసీపీ హయాంలో నిలిచిన పనులు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచాయి. అప్పటి వైసీపీ నేత అక్రమ వ్యవహారంతోనే పనులు నిలిచిపోయాయి అంటూ ఆపార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి బహి రంగంగా గళం వినిపిం చారు. ఇక వైసీపీ అధి ష్ఠానం కూడా రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరిం చింది ఈ క్రమంలోనే పర్చూరు-ఇంకొల్లు ప్రధాన రహదారి కూడా అధ్వానంగా తయారైంది. ఈరోడ్డులో కొద్దిపాటి వర్షం పడినా నలుదిక్కులా రాకపోకలు నిలిచిపోవాల్సిందే అంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

28న రోడ్డు పనులకు శంకుస్ధాపన

పర్చూరు - ఇంకొల్లు రహదారి నిర్మాణానికి ఈనెల 28న శంకుస్ధాపన చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశించారు. సరైన రహదారి లేక ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యుద్ద ప్రాతిపతికన నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - May 25 , 2025 | 11:56 PM