ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Jun 24 , 2025 | 10:57 PM

జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎమ్‌.బాలాజీ కోరారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం కోర్టు పరిధిలోని ఆరు మండలాల పోలీసు అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా న్యాయాధికారి బాలాజీ మాట్లాడుతూ జూలై 5న జరిగే లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు రాజీ చేసుకునేలా కక్షిదారులతో పోలీసులు మాట్లాడాలన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న న్యాయాధికారి బాలాజీ

మార్కాపురం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎమ్‌.బాలాజీ కోరారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో మంగళవారం కోర్టు పరిధిలోని ఆరు మండలాల పోలీసు అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా న్యాయాధికారి బాలాజీ మాట్లాడుతూ జూలై 5న జరిగే లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు రాజీ చేసుకునేలా కక్షిదారులతో పోలీసులు మాట్లాడాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కక్షలు వీడి సామరస్యపూర్వక వాతావరణంలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హెల్మెట్‌లు తప్పనిసరిగా వాడేలా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. దీనిద్వారా రోడ్డు ప్రమాదాల్లో మరణాలను చాలా వరకు తగ్గించవచ్చన్నారు. ఎక్కువ క్రిమినల్‌ కేసులు రాజీ చేయడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. రాజీపడదగిన క్రిమినల్‌, చెక్‌ బౌన్స్‌, బ్యాం కులు, బీఎ్‌సఎన్‌ఎల్‌ ప్రీ లిటిగేషన్‌ కేసులను పరిష్కరించుకునేలా కక్షిదారులతో మాట్లాడాలన్నారు. సమావేశంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం సర్కిళ్ల పరిధిలోని పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 10:57 PM