ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక పశుప్రదర్శన

ABN, Publish Date - Apr 21 , 2025 | 12:40 AM

తెలుగు రాష్ర్టాల రైతుల సంస్కృతి, సంప్రదా యాలకు పశుప్రదర్శనలు ప్రతీకలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

మార్కాపురం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల రైతుల సంస్కృతి, సంప్రదా యాలకు పశుప్రదర్శనలు ప్రతీకలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌వీకేపీ కళాశాలలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహి స్తున్న జాతీయస్థాయి పశుప్రదర్శన పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుపోష కులు ఎంతో వ్యయప్రయాసల కోర్చి పోటీల్లో పాల్గొనేందుకు దూరప్రాంతాల నుంచి వస్తు న్నారన్నారు. వారికి నగదు బహుమతి రూపంలో ఎంత ఇచ్చిన తక్కువే అన్నారు. పశువుల పట్ల రైతాంగానికి ఉండే అను బంధంతోనే ఎంతో ఖర్చుతో కూడుకున్నదైనా వాటిని పోషిస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున పోటీలు నిర్వహిస్తామ న్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కందుల కుమార్తె నందినిరెడ్డి పోటీల్లో పాల్గొన్న ఎడ్ల యజమానులను సన్మానించి, కొద్దిసేపు బండను లాగించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, తూర్పువీధి బండకమిటీ నిర్వాహకులు మాలపాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా ఎడ్లు సత్తా

చివరిరోజు సీనియర్‌ సైజు విభాగంలో పోటీలు ఉదయం, సాయంత్రం వేళల్లో జరి గాయి. ఈ పోటీల్లో నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గుంపరమానుదిన్నె గ్రామానికి చెందిన కుందూరు రామ్‌భూపాల్‌ రెడ్డికి చెందిన ఎడ్లజత 2,310 అడుగుల దూరం బండలాగి ప్రథమ స్థానంలో నిలిచింది. మొదటి బహుమతిగా రూ.1.20 లక్షలను దాత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎడ్ల యజమానికి అందజేశారు. అదేవిధంగా రెండవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్‌ బుల్స్‌ ఎడ్లజత 2,117 అడుగుల దూరం బండనులాగి నిలిచింది. ద్వితీయ బహుమతిగా రూ.90 వేలను బోయలపల్లి పోలిరెడ్డి యజమాని డి.రోహన్‌బాబుకు అంద జేశారు. మూడవ స్థానంలో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఎమ్‌.రమేష్‌బాబు, వైఎంఆర్‌ కాలనీకి చెందిన గురివిరెడ్డిల ఎడ్ల జత 2,056 అడుగుల దూరంలాగి నిలిచింది. వీరికి బహుమతిగా రూ.70 వేలను గొలమారి వెంకటరెడ్డి అందించారు. బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పావులూరి వీరస్వామి చౌదరికి చెందిన ఎడ్ల జత 2,004 అడుగుల దూరం బండనులాగి నాలుగవస్థానంలో నిలిచింది. నగదు బహుమతి రూ.50 వేలను బోరెడ్డి రాజారెడ్డి అందజేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్‌.కొత్తూరుకు చెందిన బోనం సుబ్రహ్మణేశ్వరరెడ్డి, సిరివెళ్ల మండలం గుంపరమానుదిన్నె గ్రామానికి చెందిన కుందూరు రామ్‌భూపాల్‌రెడ్డిల కంబైన్డ్‌ ఎడ్లజత 2,001 అడుగుల దూరం బండనులాగి ఐదవస్థానంలో నిలిచింది. బహుమతిగా రూ.30 వేలను దాత మారెళ్ల చెన్నారెడ్డి, సముద్రాల కిషోర్‌కుమార్‌ల నుంచి అందుకున్నారు. మార్కాపురం మండలం బొడిచెర్లకు చెందిన తిండి నక్షత్రారెడ్డి ఎడ్లజత 1,816 అడుగులు బండనులాగి ఆరవస్థానంలో నిలిచి రూ.20 వేల నగదు బహుమతిని దాత మారంరెడ్డి రామకృష్ణారెడ్డి నుంచి అందుకున్నాయి. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఎడ్లజత యజమానికి జ్ఞాపికను డాక్టర్‌ కందుల రాజశేఖర్‌రెడ్డి అందించారు.

Updated Date - Apr 21 , 2025 | 12:40 AM