గ్రంథాలయ కార్యదర్శి తనిఖీ
ABN, Publish Date - May 14 , 2025 | 10:57 PM
పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.
గిద్దలూరు, మే 14 (ఆంద్రజ్యోతి) : పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. చదవడం మాకు ఇష్టం కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచించారు. వేసవి శిక్షణ తరగతులను ఉపయోగించుకుని విజ్ఞానం పొందాలని, ఆటపాటల్లో శిక్షణ పొంది ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో గ్రంథపాలకురాలు ప్రసన్నకుమారి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రామిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 10:57 PM