ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యాటక కేంద్రంగా కంభం చెరువు

ABN, Publish Date - Apr 29 , 2025 | 10:34 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో ఏడాదిలోగా చారిత్రాత్మక కంభం చెరువు పర్యాటక కేంద్రంగా మారనున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా టూరిజం శాఖ అధికారి అద్దంకి రమ్యతో కలిసి కంభం చెరువును పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.

టూరిజం అధికారులతో కలిసి బోటులో పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఏడాదిలోగా అభివృద్ధి పనులు

సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో

టూరిజం అధికారితో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో ఏడాదిలోగా చారిత్రాత్మక కంభం చెరువు పర్యాటక కేంద్రంగా మారనున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా టూరిజం శాఖ అధికారి అద్దంకి రమ్యతో కలిసి కంభం చెరువును పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కంభం చెరువును పర్యాటక కేంద్రంగా చేయాలని దశాబ్దాలనాటి ఈప్రాంత ప్రజల కోరిక నెరవేరనున్నదని తెలిపారు. తాను ఇటీవల ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని కలిసి మాట్లాడగా ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చెరువు అయిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా చేయాలని కోరడంతో వారు స్పందించి ఆదిశగా చెరువును పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. అందులో భాగంగానే మంగళవారం జిల్లా టూరిజం అధికారి రమ్య కంభం చెరువును పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. కంభం చెరువును అభివృద్ధి చేయాలని తాను అసెంబ్లీలో, ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించుకోగా దానిని పరిగణలోకి తీసుకొని కంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేసిందన్నారు. చెరువుకు సంబంధించిన వివరాలను అధికారికి తెలియజేశానని, బోటింగ్‌ ద్వారా చెరువును పరిశీలించినట్లు తెలిపారు. ఏడాదిన్నరలోగా కంభం చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా టూరిజంశాఖ అధికారి రమ్య మాట్లాడుతూ కంభం చెరువును త్వరితగతిన అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తామని, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కృషి ఫలితంగా తొలి అడుగు పడిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఇరిగేషన్‌ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 10:34 PM