ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి పేదకూ న్యాయం

ABN, Publish Date - Jul 01 , 2025 | 11:50 PM

ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి పేదకూ న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 13 వార్డు పూల సుబ్బయ్య కాలనీలో వృద్ధులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ను మంగళవారం ఉదయం అధికారులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

పింఛన్‌ను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కందుల

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ల పంపిణీలో ఎమ్మెల్యే కందుల

మార్కాపురం రూరల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి పేదకూ న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 13 వార్డు పూల సుబ్బయ్య కాలనీలో వృద్ధులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ను మంగళవారం ఉదయం అధికారులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీన పింఛన్‌ రూ.4వేలు అందజేస్తున్నారన్నారు. ఏడాది పాలనలో సూపర్‌సిక్స్‌ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణ, వక్కలగడ్డ మల్లికార్జున, సత్యనారాయణ, వెంకటరెడ్డి, మొరా వెంకటరెడ్డి, నాయకులు మౌలాలి, వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : వైసీపీ పాలనతో నెలకొన్న తీవ్ర సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని 7వ వార్డు కొంగళవీడు రోడ్డులో మంగళవారం ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి వృద్ధులకు పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలకులు వృద్ధులను దారుణంగా మోసం చేశారన్నారు. రూ.1000 పెంచేందుకు జగన్‌రెడ్డికి నాలుగేళ్లు పట్టిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే రూ.4వేల పింఛన్‌ అందజేశారన్నారు. ఓ పక్క సంక్షేమాన్ని, మరో పక్క అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇది అని అన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు సయ్యద్‌ షానేషావలి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, కౌన్సిలర్‌ బిల్లా జయలక్ష్మి, టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్యయాదవ్‌, బిల్లా రమేష్‌, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ రమణ పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం రూరల్‌ : ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4వేలు, రూ.6వేలు పింఛన్‌ను ప్రభుత్వం అందజేసోందని, దీంతో వృద్ధులు, దివ్యాంగుల్లో ఆనందం వెల్లువిరిస్తోందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మంగళవారం మండలంలోని బోయలపల్లి గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి పింఛన్‌ పంపిణీ చేసిన ఎరిక్షన్‌బాబు స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, సర్చంచ్‌ పాలడుగు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యుడు వేగినాటి సత్యనారాయణ, వెంకట కోటయ్య, పెరుమాళ్ల మల్లికార్జునరావు, మంత్రు నాయక్‌, సత్యనారాయణగౌడ్‌, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రమేష్‌, వీఆర్వో పెద్ద ఓబయ్య, పంచాయితీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పొదిలి : ఎన్టీఆర్‌ భరసా పింఛన్‌ల పంపిణీని మండలంలో మంగళవారం ఆముదాలపల్లి గ్రామంలో ఎంపీడీవో గుత్తా శోభన్‌బాబు ప్రారంభించారు. సుమారు 90శాతం పంపిణీ పూర్తయినట్లు ఆయన తెలిపారు. మిగిలిన లబ్ధిదారులకు బుధవారం అందజేస్తారని చెప్పారు. టీడీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు ఉదయం నుంచే గ్రామాల్లో పింఛన్‌లను పంపిణీ చేశారు.

Updated Date - Jul 01 , 2025 | 11:50 PM