ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులపై జగన్‌రెడ్డి మొసలి కన్నీరు

ABN, Publish Date - Jul 22 , 2025 | 11:49 PM

రై తుల పేరు చెప్పుకుని నాడు అధికారంలోకి వచ్చి మోటార్లకు మీటర్లు బిగించి రైతులను మోసగించిన జగన్‌రెడ్డి నేడు మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు.

పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఆగస్టు 15 నుంచి తొలివిడత అన్నదాత సుఖీభవ

గిద్దలూరు టౌన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : రై తుల పేరు చెప్పుకుని నాడు అధికారంలోకి వచ్చి మోటార్లకు మీటర్లు బిగించి రైతులను మోసగించిన జగన్‌రెడ్డి నేడు మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మండలంలోని కొంగళవీడు, బయనపల్లె, కొమ్మునూరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నా రు. ఈసందర్భంగా కొంగళవీడు గ్రామంలో రూ.15లక్షలతో నిర్మించనున్న సిమెంట్‌ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కొంగళవీడు నుంచి నరవ గ్రామానికి రూ.3.20కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆయన ప్రారంభించారు. వేములపాడు, కొమ్మునూరు గ్రామాలలో రూ.20లక్షలతో నిర్మించనున్న సిమెంట్‌ రోడ్డుకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గడిచిన ఏడాదిలో మహిళలు, రైతుల సంక్షేమంతోపాటు యువత భవిష్యత్‌ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు చేసిందేమీ లేదని, కానీ జగన్‌రెడ్డి ముసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం గిట్టుబాటు ధరలు, పొగాకు, మామిడి కొనుగోళ్లకు కృషి చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకాన్ని మొదటిగా ఆగస్టు 15వ తేదీన అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్య, మీసాల పాపయ్య, బాబాయి, మీసాల రమేష్‌ ఉన్నారు.

అందరికీ సంక్షేమ పథకాలు అందినపుడే అభివృద్ధి

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం : అందరికీ సంక్షేమ పథకాలు అందినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా వినూత్న పథకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలోని ఎస్టీ కాలనీలో మంగళవారం జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్‌ పెంచి వారు గౌరంగా జీవించేలా చేశారన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న పిల్లలందరూ చదువుకునేలా మార్గం చూపారని తెలిపారు. ఇలా అన్నివర్గాల ప్రజలకు చేయూత నిచ్చేలా సూపర్‌ సిక్స్‌ పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు సుబ్బారావు, సత్యనారాయణగౌడ్‌, యక్కలి తిమ్మయ్య, డి.వెంకట్రావు, కిశోర్‌, పట్టణ అధ్యక్షులు పీ మల్లికార్జునరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్‌ గపూర్‌, బ్రహ్మారెడ్డి, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పెద్ద బొమ్మలాపురంలో

పెద్ద దోర్నాల : మండలంలోని పెద్ద బొమ్మలాపురం తూర్పు పల్లెలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఒంగోలు పార్లమెంటు టీఎన్‌ టీయూసీ ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో నే బృహత్త్తర పధకాలైన తల్లికి వందనం,3గ్యాస్‌ సిలెండర్ల మంజూరు, ఫించను 4వేలకు పెంపును వివ రిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ, ఆగస్టులో మహిళలకు ఆర్‌టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు జరుగుతుందని చెబుతూ మనం మెచ్చిన ప్రభుత్వానికి అండగా ఉందామని ప్రజలను కోరారు.అనంతరం అమలైన ప్రభుత్వ పధకాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ కార్య క్రమంలో నాయకులు వెంకటేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, గంగరాజు, నర్సిరెడ్డి, మల్లయ్య, దాని యేలు, ఈశ్వర్‌, రాజయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:49 PM