ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోతురాజు కాలువ పనుల్లో అవకతవకలు

ABN, Publish Date - Mar 19 , 2025 | 01:25 AM

ఒంగోలు నగర ముంపు నివారణ కోసం ఉద్దేశించిన పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులలో గత వైసీపీ పాలనలో అవకతవకలు, అవినీతి జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆరోపించారు. ఆయా అక్రమాలపై సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బాఽధ్యులపై చర్యలు తీసుకోవాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే జనార్దన్‌ డిమాండ్‌

ఒంగోలులో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు విజ్ఞప్తి

ఒంగోలు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగర ముంపు నివారణ కోసం ఉద్దేశించిన పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులలో గత వైసీపీ పాలనలో అవకతవకలు, అవినీతి జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆరోపించారు. ఆయా అక్రమాలపై సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జనార్దన్‌ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో ముంపు నివారణ కోసం 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోతురాజు కాలువ ఆధునికీకరణ అవసరాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి స్థానిక ఎమ్మెల్యేగా పలుమార్లు తీసుకెళ్లగా రూ.89.75 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆ పనులు చేపట్టేలోపు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిందన్నారు. అధికా రంలోకి వచ్చిన వైసీపీ సర్కారు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రూ.62 కోట్లతో పనులు చేపట్టి రూ.41.75 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపిం దన్నారు. అందులో ముగ్గురు కాంట్రాక్టర్లు మారారని, అయినా పనులు పూర్తికాకపోవడమే కాక పలు అవకత వకలు జరిగాయని ఆరోపించారు. వాటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు మిగిలిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేశారు. ఒంగోలులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు గతంలో యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్‌ హామీ ఇచ్చారని, ఆ పథకాన్ని మంజూరు చేసి నగరంలో ఇక్కట్లు తీర్చాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. వాటిపై మునిసిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమాధానం ఇస్తూ సుమారు రూ.78.03 కోట్లతో పోతురాజు కాలువ పనులు మంజూరు చేయగా రూ.68.51 కోట్లకు టెండర్‌ పొంది రూ.48.10 కోట్ల పనులు చేశారన్నారు. ఈ పనులలో భాగంగా 5.10 కి.మీ మేర కాంక్రీట్‌ బెడ్‌తో వాల్‌ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. అయితే గత ప్రభుత్వ కాలంలో జరిగిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, బెడ్‌ లేకుండా వాల్‌ నిర్మాణం చేశారన్నారు. అందులో 50 మీటర్ల మేర వాల్‌ కూలి పోయిందన్నారు. వీటిపై జలవనరులశాఖ అధికారుల ద్వారా విచారణ చేయిసా ్తమన్నారు. అలాగే భూగర్భ డ్రైనేజీ పనులకు డీపీఆర్‌ సిద్ధం చేసేందుకు టెండర్‌ పిలిచామని, టెక్నికల్‌ బిడ్‌ కూడా ఓకే అయిందన్న మంత్రి నారాయణ ఆర్థిక బిడ్‌ అప్రూవల్‌ చేశాక ఆ పనులను చేపడతామన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 01:25 AM