నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN, Publish Date - May 12 , 2025 | 01:43 AM
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభవుతున్నాయి. అందుకు సంబంఽ దించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,742 మంది హాజరువుతున్నారు.
నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ
అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు
ఒంగోలు విద్య, మే 11 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభవుతున్నాయి. అందుకు సంబంఽ దించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,742 మంది హాజరువుతున్నారు. వీరికోసం 73 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 46, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 27 ఉన్నాయి. ఉదయం 9గంటల నుంచి ఫస్టియర్, మధ్యాహ్నం 2.30నుంచి సెకండియర్ వారికి పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం లేటైనా విద్యార్థులను అనుమతించరు. అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలను అనుమతించరు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలో అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బందిని నియమించారు. విద్యార్థులకు అన్ని వసతులను కల్పించారు.
Updated Date - May 12 , 2025 | 01:43 AM