పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:51 AM
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహి స్తూ ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు క ల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీ మ్ అన్సారియా ఆదేశించారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యో తి): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహి స్తూ ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు క ల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీ మ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయం త్రం పరిశ్రమలు, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో అమలు జరుగుతున్న సింగిల్‌డెస్క్ పాలసీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్ర భుత్వ పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోపరిశ్రమల స్థాపనతో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అనుగుణం గా యువతకు అవసరమైన శిక్షణ కార్యక్రమా లు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో జ రుగుతున్న పీఎం విశ్వకర్మ యోజన పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ని యోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ద్ధం చేయాలని కోరారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం మే నేజర్ శ్రీనివాసరావు, ఏపీఐఐ సీ జోనల్ మేనే జర్ మదన్‌మోహన్ పాల్గొన్నారు.
బ్యాటరీ ఆటో అందజేత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదే శాల మేరకు యర్రగొండపాలెం మండలానికి చెందిన దివ్యాంగుడైన వెన్న వెంకటరెడ్డి జీవ నాధారం కోసం కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం రాత్రి కలెక్టరేట్‌లో బ్యాటరీ ఆటోను అందజేశారు. గనులు, దివ్యాంగుల శాఖ స మన్వయంతో ఈ ఆటోను కొనుగోలు చేసి లబ్ధి దారుడికి అందజేసినట్లు తెలిపారు.
Updated Date - Apr 26 , 2025 | 12:51 AM