ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమృత్‌ పథకం అమలుకు శ్రీకారం

ABN, Publish Date - Jul 18 , 2025 | 01:14 AM

దర్శి మున్సిపాలిటీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమృత్‌ పథకం అమలుకు ఎట్టకేలకు అధికారులు శ్రీకా రం చుట్టారు. కొద్దిరోజుల క్రితం రూ.130.60 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు.

దర్శి పట్టణ వ్యూ

రూ.130.60 కోట్ల పనులకు టెండర్లు

దర్శి, జూలై 17(ఆంధ్రజ్యోతి): దర్శి మున్సిపాలిటీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమృత్‌ పథకం అమలుకు ఎట్టకేలకు అధికారులు శ్రీకా రం చుట్టారు. కొద్దిరోజుల క్రితం రూ.130.60 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. టెండర్లు ఖరారైన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమృత్‌ పథకానికి రూ.121 కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. వైసీపీ పాలకులు

ఈ పథకం అమలు గురించి పట్టించుకోపోవటంతో మూడేళ్ళ కాలం వృథా అయింది.

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లు రద్దు చేశారు. కొత్త అంచనాలతో రూ.130.60 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు రీజనల్‌ స్థాయిలో పిలిచారు. చిత్తూరు, నెల్లూరు, ప్ర కాశం జిల్లాకు సంబంధించిన పట్టణాల్లో అమృత్‌ పథకం ద్వారా విడుదలైన నిధుల పనులు నిర్వహణకు మొత్తం కలిపి ఒకే టెండర్లు పిలిచినట్లు మున్సిపల్‌ ఈఈ శ్రీనివాస సంజీవ్‌ తెలిపారు. ఈనెల 30న టెండర్లు ఓపన్‌

చేస్తారు. దాఖలైన టెండర్లు పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని ప్రభుత్వానికి నివేదిస్తారు. మంత్రివర్గం సమీక్షించి టెండర్లు ఖరారు చేస్తుందని ఆయన వివరించారు.

ఈ పథకం అమల్లోకి వస్తే దర్శి మున్సిపాలిటీలోని 40 వేల మందిని స్వచ్ఛమైన మంచినీరు అందించే అవకాశం ఉంటుంది. సాగర్‌ కాలువ నుంచి గ్రావిటీ ద్వారా దర్శి మున్సిపాలిటీని ఆనుకొని ఉన్న ముండ్లమూరు మండలం పులిపాడు చెరువుకు నీరు నింపుతారు. అక్కడ నుంచి పైప్‌లైన్‌ ద్వారా కొళాయిలకు నీరు సరఫరా చేస్తారు. ఇంటింటికి కొళాయిలు ఏర్పాటుచేసి మున్సిపాలిటీ ద్వారా అందరికీ మంచినీరు అందిస్తారు. రోజుకు 13 మిలియన్‌ లీటర్లనీరు సరఫరా చేసే సామర్థ్యం కల్గి ఉండేలా పథకాన్ని రూపొందించారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో

ఉంచుకొని 30 సంవత్సరాల కొరకు పెరిగిన జనాభాకు సరిపోయేలా ఈపథకాన్ని అమలు చేస్తారు. ఎంతోకాలంగా అమలుకు నోచుకోని అమృత్‌ పథకం టెండర్లు పిలవటంతో దర్శి పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 18 , 2025 | 01:14 AM