ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చదువుకోమంటే తనువు చాలించింది

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:54 PM

చదువుకోమని తల్లి గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురైన కుమార్తె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని గోళ్ళవిడిపి గ్రామంలోని ఎస్సీ పాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వెంకటమ్మకు కొలుకుల గ్రామానికి చెందిన బరిగెల సాలవయ్యతో వివాహం అయ్యింది.

బాలిక మృతదేహన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సై (ఇన్‌సెట్లో) శైలమ్మ (ఫైల్‌)

మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు కూడా కారణం

ఎర్రగొండపాలెం రూరల్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): చదువుకోమని తల్లి గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురైన కుమార్తె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని గోళ్ళవిడిపి గ్రామంలోని ఎస్సీ పాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వెంకటమ్మకు కొలుకుల గ్రామానికి చెందిన బరిగెల సాలవయ్యతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 10 ఏళ్ల కిందట భార్యాభర్తలు పలు కారణాల రీత్యా దూరంగా ఉంటున్నారు. అయితే స్వగ్రామం అయిన గోళ్ళవిడిపిలో కూతురు బరిగెల శైలమ్మ(16)తో తల్లి ఉంటూ జీవనం సాగిస్తుంది. శైలమ్మ 8 వతరగతి వరకు ఎర్రగొండపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించింది. తల్లి కష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను చూసి శైలమ్మ మధ్యలోనే చదువు మానుకొని తల్లితో కూలి పనులకు వెళుతోంది. అయితే గత కొన్ని రోజులుగా తల్లి వెంకటమ్మ కుమార్తె శైలమ్మను చదువుకోవాలని ఒత్తిడి చేస్తోంది. అలాగే శుక్రవారం కూడా చదువుకోవాలని గట్టిగా మందలించి పనుల నిమిత్తం తల్లి ఎర్రగొండపాలెం వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన కుమార్తె ఇంట్లో ప్యానుకు చున్నీతో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి సోదరుడు యోలిషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సీహెచ్‌ ప్రభాకరరావు, ఎస్సై పి. చౌడయ్యలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:54 PM