అకుంఠిత దీక్షతో ప్రయత్నిస్తే విజయం తథ్యం
ABN, Publish Date - May 10 , 2025 | 01:01 AM
నిర్థిష్ట లక్ష్యాన్ని ఏర్పర చుకొని అంకుఠిత దీక్షతో అలుపెరుగని కృషిచేస్తే విజయం తఽఽథ్యమని సివిల్స్ ర్యాంకర్ మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 350వ ర్యాంకు సాధించిన అనంతరం ఆయన శుక్రవారం తొలిసారి స్వగ్రామమైన ఊళ్లపాలెంకు వచ్చారు. గ్రామస్థులు సింగరాయకొండ నుంచి ఊళ్లపాలెం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.
సివిల్స్ ర్యాంకర్ ఉదయ్‌కృష్ణారెడ్డి
స్వగ్రామం ఊళ్లపాలెంలో ఘనంగా పౌరసన్మానం
సింగరాయకొండ, మే 9 (ఆంధ్రజ్యోతి) : నిర్థిష్ట లక్ష్యాన్ని ఏర్పర చుకొని అంకుఠిత దీక్షతో అలుపెరుగని కృషిచేస్తే విజయం తఽఽథ్యమని సివిల్స్ ర్యాంకర్ మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 350వ ర్యాంకు సాధించిన అనంతరం ఆయన శుక్రవారం తొలిసారి స్వగ్రామమైన ఊళ్లపాలెంకు వచ్చారు. గ్రామస్థులు సింగరాయకొండ నుంచి ఊళ్లపాలెం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పౌర సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉదయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో పుట్టిన తాను ఐపీఎస్ స్థాయికి చేరుకోవడానికి వివిధ దశల్లో ఉపాధ్యాయులు నేర్పిన విద్య, శ్రేయోభిలాషులు, స్థానికులు చేసిన సూచనలు, సలహాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. సివిల్స్ సాధించేందుకు పదేళ్లపాటు నిర్విరామంగా కష్టపడ్డానని వివరించారు. తన నాయనమ్మ రమణమ్మ గ్రామంలో కూరగాయలు అమ్మి తనను, తన సోదరుడిని చదివించిందని గుర్తుచేసుకున్నారు. ఆమె దగ్గర గ్రామస్థులు కూరగాయలు కొనుగోలు చేసి ఒకరకంగా తాము చదువుకోవడానికి ఆర్థికంగా అండగా నిలిచారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎమర్జెన్సీ వస్తే 108 అంబులెన్స్ ఉన్నట్లే జంతువులకు కూడా 109 సర్వీసులు తెచ్చి అత్యవసర సేవలందిం చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్థులు ఉదయ్‌కృష్ణారెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు.
Updated Date - May 10 , 2025 | 01:01 AM