ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు లేని గ్రామంగా మారుస్తా

ABN, Publish Date - Mar 30 , 2025 | 12:03 AM

సమస్య లేని ఊరుగా పెదగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవులదొడ్డికొత్తగొల్లపాలెంని మారుస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు అన్నారు. ఆవులదొడ్డికొత్తపాలెం గ్రామంలో ఏప్రిల్‌ 1వ తేదీన జరిగే పేదల సేవ పింఛన్ల పం పిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబ రానున్న నేపథ్యంలో శనివారం ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఏలూరి పరిశీలించారు.

ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి

చినగంజాం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : సమస్య లేని ఊరుగా పెదగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవులదొడ్డికొత్తగొల్లపాలెంని మారుస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు అన్నారు. ఆవులదొడ్డికొత్తపాలెం గ్రామంలో ఏప్రిల్‌ 1వ తేదీన జరిగే పేదల సేవ పింఛన్ల పం పిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబ రానున్న నేపథ్యంలో శనివారం ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఏలూరి పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న హెలిప్యాడ్‌, కార్యకర్తల సమావేశ స్థలం, ప్రజావేదిక, పింఛన్ల పంపిణీ చేసే గృహాలు, రామాల యం తదితర వాటిని పరిశీలించారు. ఏర్పాట్లు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి గ్రామస్థులతో మాట్లాడారు. సమస్యలపై అర్జీలను స్వీకరించారు. యువతకు క్రీడా స్ఫూర్తి ఉండాలని సూచించారు. గణేష్‌, కార్తీక్‌, గోవిందు, దినే్‌ష విద్యార్థుల క్రికెట్‌ టీంలకు రెండు క్రికెట్‌ కిట్లను అందజేశారు. ముఖ్యమంత్రి పర్యటను విజయవంతం చేయాలని గ్రామస్థులను ఎమ్మెల్యే ఏలూరి కోరారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 12:03 AM