ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎలా ముందుకెళ్దాం!

ABN, Publish Date - Mar 18 , 2025 | 01:26 AM

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం (పీ4) అమలును అందరి మనోభావాలకు అనుగుణంగా చేయాలని భావిస్తోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటోంది.

పీ4 సర్వేను పరిశీలిస్తున్న సీపీవో వెంకటేశ్వర్లు (ఫైల్‌)

సలహాలు, సూచనలు కోరుతున్న ప్రభుత్వం

వెబ్‌సైట్‌ ద్వారా సేకరణ

జిల్లాలో ఇప్పటికే 5వేల మందికిపైగా అభిప్రాయాలు వెల్లడి

ఉగాది నుంచి అమలుకు ప్రభుత్వం సన్నాహాలు

ఒంగోలు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం (పీ4) అమలును అందరి మనోభావాలకు అనుగుణంగా చేయాలని భావిస్తోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. అందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించి తద్వారా 13 అంశాలపై అభిప్రాయాలను సేకరిస్తోంది. ఉగాది నుంచి పీ4 అమలు చేయాలన్న భావనతో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కుటుంబాల స్థితిగతులపై సర్వేని పూర్తిచేసిన విషయం విదితమే. గ్రామ సచివాలయం, వార్డు యూనిట్‌గా ఆ పరిధిలో కుటుంబాల ఆర్థిక పరిస్థితి, సామాజిక అంశాల ఆధారంగా అత్యంత పేదరిక జీవితం గడుపుతున్న 20శాతం కుటుంబాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పీ4 విధానాన్ని తెచ్చింది. అలాంటి కుటుంబాల ఉపాధి, వృత్తి నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు మెరుగుకు ప్రభుత్వం తోడ్పాటుతోపాటు ఆ ప్రాంతంలోని ధనవంతులు, పారిశ్రామిక, వ్యాపారరంగాల పెద్దల సహకారంతో చర్యలు చేపట్టాలన్నది ప్రధాన ఉద్దేశం. అందుకోసం తొలిగా జిల్లాలవారీ సర్వే నిర్వహించారు. అలా జిల్లాలోనూ గత నెలాఖరులో యంత్రాంగం నిర్వహించింది.

వెబ్‌సైట్‌తోపాటు క్యూఆర్‌ కోడ్‌

జిల్లాలో అధికారిక అంచనా ప్రకారం మొత్తం 5,89,361 కుటుంబాలు ఉండగా 5,87,883 కుటుంబాల (99.73శాతం) సర్వే జరిగినట్లు యంత్రాంగం చెబుతోంది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్వే పూర్తికాగా రెండో దశలో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌తోపాటు క్యూఆర్‌ కోడ్‌ను కూడా ఇచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు దీనిపై అవగాహన కల్పించి వారి ద్వారా మూడు రోజుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అలా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 5వేల మంది వివిధ వర్గాల ప్రజలు వెబ్‌సైట్‌ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. ఈనెల 25 వరకు ప్రభుత్వం ఇందుకు అవకాశం ఇవ్వగా ఈ వారంలో భారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేసే వైపు యంత్రాంగం దృష్టి సారించారు. ప్రధానంగా పేదరికానికి మీ ప్రాంతంలో ప్రధాన కారణం. పేదరిక నిర్మూలనలో ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రతిబంధకాలు, కుటుంబం మెరుగైన భవిష్యత్‌కు ఏమి కోరుకుంటున్నారు? ఎలాంటి ఉపాధి అవకాశాలకు మీ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది? ధనవంతులు-ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ ఎలా సహకారం అందించగలరు? దాతల సహకారానికి ఏ పేరు పెడితే బాగుంటుంది? అన్న అంశాలపై సలహాలు కోరడంతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు.

25లోపు పూర్తిచేయాలి

ఈనెల 30న ఉగాది సందర్భంగా రాష్ట్రంలో లాంఛనంగా పీ4 అమలు ప్రారంభించే యోచనలో ఉన్న ప్రభుత్వం ఈనెల 25లోపు సలహాల సేకరణ పూర్తిచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పూర్తిచేసిన పీ4 కుటుంబ సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం కమాండ్‌ కంట్రోలు సెంటర్‌కు నివేదించారు. వాటి ఆధారంగా గ్రామ, వార్డులలో అత్యంత వెనుకబడిన 20శాతం కుటుంబాల వివరాలను తిరిగి జిల్లా యంత్రాంగానికి అందుతాయి. వాటిని సచివాలయాల్లో ప్రచురించి లోటుపాట్ల సవరణ చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రభుత్వం ఉదాత్త ఆశయంతో చేపట్టిన పీ4 అమలు మరింత మెరుగ్గా ఉండేందుకు ప్రజానీకం సలహాలు, సూచనలు వెబ్‌సైట్‌ ద్వారా ఇవ్వాలని జిల్లాలో ఈ కార్యక్రమ అమలు పర్యవేక్షణాధికారైన సీపీవో వెంకటేశ్వర్లు కోరారు. సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి అందులో ఉన్న అంశాలకు సమాధానం ఇస్తే సరిపోతుందన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 01:26 AM