ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

ABN, Publish Date - Apr 24 , 2025 | 10:45 PM

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇ స్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డా క్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. స్థానిక కస్తూ ర్భా కళాశాలలో రూ.1.59 కోట్లతో నిర్మించే నూతన భవనాలకు గురువారం ఆమె శంకు స్థాపన చేశారు.

కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌, మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇ స్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డా క్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. స్థానిక కస్తూ ర్భా కళాశాలలో రూ.1.59 కోట్లతో నిర్మించే నూతన భవనాలకు గురువారం ఆమె శంకు స్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పూ ర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందు కు కృషి చేస్తున్నట్టు చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారం గంలో పెనుమార్పులు తెచ్చారన్నారు. ఈఏడాది విడు దలైన ఇంటర్‌, పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉత్తీర్ణత సాధించటమే ఇందుకు నిదర్శనమన్నారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివం చన లేకుండా కృషి చేస్తామన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తా మన్నారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ లలిత్‌సాగర్‌, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పి చ్చయ్య, దారం నాగవేణి, ప్రిన్సిపాల్‌ అరుణ, ఎంఈవో లు రఘురామయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

దీర్ఘకాలిక విద్యుత్‌ సమస్య పరిష్కారం

ఎంతోకాలం గా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్‌ సమస్యను పరిష్కరించ టంతో చింతలపాలెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు. దర్శి నగర పంచాయతీ 20 వార్డు పరిధిలోని చింతలపాలెం గ్రామస్థులు ఎంతోకా లంగా సింగిల్‌ ఫేజ్‌తో సక్రమంగా కరెంట్‌ సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చొరవతో ఈ సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, కమిషనర్‌ వై.మహేశ్వర రావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, నారపుశెట్టి మధు, శోభా రాణి, తదిత రులు పాల్గొన్నారు.

బాలికల వసతి గృహానికి శంకుస్థాపన

కురిచేడు : స్థానిక వైఆర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కేజీబీవీ వసతి గృహానికి గురువారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.194.21 లక్షలతో వసతి గృహా న్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. విద్యలో బాలికలు రాణిం చాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్‌ లలిత్‌సాగర్‌, పిడతల నెమిలయ్య, కాట్రాజు నాగరాజు, డాక్టర్‌ సునీల్‌, కిలారి కొండయ్య, తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Apr 24 , 2025 | 10:45 PM