ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

ABN, Publish Date - Mar 17 , 2025 | 10:58 PM

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం కారుణ్య కోటాలో 38 మంది మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను కలెక్టర్‌ అందజేశారు.

ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌

38 మందికి అందజేసిన కలెక్టర్‌

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం కారుణ్య కోటాలో 38 మంది మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను కలెక్టర్‌ అందజేశారు. ఈకార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ, డీఆర్వో చిన ఓబులేషు ఉన్నారు.

సహేతుకంగా అర్జీలను పరిష్కరించాలి

ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సహేతుకంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మీ కోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చినఓబులేషు, డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్‌, పార్థసారథి, వరకుమార్‌, విజయజ్యోతి, కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 10:58 PM