ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒంగోలులో బంగారు వ్యాపారుల నిరసన

ABN, Publish Date - Jun 29 , 2025 | 12:31 AM

ఒంగోలు గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నగరంలో బంగారు షాపులు మూసివేసి నిరసన చేపట్టారు. వివ రాల్లోకెళితే.. అసోసియేషన్‌ అధ్యక్షుడు తాతా ప్రసాద్‌పై కొందరు వ్యాపారులు శుక్రవారం రాత్రి దౌర్జన్యం చేశారు.

బోసిపోయిన గాంధీరోడ్‌

ఒంగోలు కార్పొరేషన్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యో తి): ఒంగోలు గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నగరంలో బంగారు షాపులు మూసివేసి నిరసన చేపట్టారు. వివ రాల్లోకెళితే.. అసోసియేషన్‌ అధ్యక్షుడు తాతా ప్రసాద్‌పై కొందరు వ్యాపారులు శుక్రవారం రాత్రి దౌర్జన్యం చేశారు. దీంతో నిరసనగా శనివారం బంగారుపు షాపులు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఈ సందర్భంగా తాతా ప్ర సాద్‌ మాట్లాడుతూ అసోసియేషన్‌ ఎన్నికల విషయంలో సానుకూలంగా చర్చించుకుని మాట్లాడుకోవాల్సి ఉండగా, కొందరు బంగారు వ్యాపారులు తనపై దౌర్జన్యం చేశారని ఆరో పించారు. అనంతరం ప్రసాద్‌, మరి కొంద రు వ్యాపారులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కలిసి విన్నవించారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కో రారు. దీంతో శనివారం బంగారు దుకాణాల వీధి వెలవెలబోయింది.

Updated Date - Jun 29 , 2025 | 12:32 AM