ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం
ABN, Publish Date - Jun 18 , 2025 | 11:54 PM
ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లోకి నలుగురు యువకులు అ క్రమంగా చొరబడి తలుపులు పగులకొట్టి ఫర్నీ చర్‌ను ధ్వంసం చేశారు. అంతేగాకుండా ఆ ఇంట్లోని మహిళలపై దాడికి దిగారు. ఈ సంఘటన ఒంగోలు నగరం ఎన్‌జీవోకాలనీలో జరిగింది.
ఐదుగురు యువకులు హల్‌చల్
మహిళలను భయభ్రాంతులకు గురిచేసిన వైనం
ఒంగోలు క్రైం, జూన్18(ఆంధ్రజ్యోతి): ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లోకి నలుగురు యువకులు అ క్రమంగా చొరబడి తలుపులు పగులకొట్టి ఫర్నీ చర్‌ను ధ్వంసం చేశారు. అంతేగాకుండా ఆ ఇంట్లోని మహిళలపై దాడికి దిగారు. ఈ సంఘటన ఒంగోలు నగరం ఎన్‌జీవోకాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏఆర్ కానిస్టేబు ల్‌గా పనిచేస్తున్న గోవింద చౌదరి ఇంట్లో ఆ యన భార్య, పిల్లలతో పాటు బంధువులు ఉ న్నారు. ఇంట్లో అందరూ మహిళలే ఉండగా గోవిందచౌదరి విధులకు వెళ్ళారు. ఈక్రమం లో బుధవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఒంగోలుకు చెందిన గోపి, మరో నలుగురు యువకులు వచ్చి గోవిందచౌదరి ఇంటి సీసీకెమెరాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపును పగులగొట్టి లోపలికి వెళ్లి మహిళ లను భయభ్రాంతులకు గురి చేశారు. ఫర్నీచ ర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మహిళలు ఒక్క సారిగా పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో దుండగులు అక్కడ నుంచి పరారీ అయ్యారు. ఈమేరకు తాలుకా పోలీసు లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jun 18 , 2025 | 11:54 PM