v
ABN, Publish Date - May 15 , 2025 | 11:26 PM
మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి గంజికుంట్ల మనోహర్ (40) మృతదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రాచర్లకు చెందిన మనోహర్ కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలో నివాసం ఉంటూ ఆ ప్రాంతంలోనే ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు.
ఆర్మీ ఉద్యోగి మనోహర్‌కు కన్నీటివీడ్కోలు
రాచర్ల (గిద్దలూరు), మే 15 (ఆంధ్రజ్యోతి) : మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి గంజికుంట్ల మనోహర్ (40) మృతదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రాచర్లకు చెందిన మనోహర్ కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలో నివాసం ఉంటూ ఆ ప్రాంతంలోనే ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా మంగళవారం గుండెపోటుకు గురై మృతిచెందారు. బుధవారం రాత్రి మనోహర్ మృతదేహాన్ని స్వగ్రామమైన రాచర్లకు తీసుకురాగా, గురువారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. సైనిక ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగులు సెల్యూట్ చేసి మనోహర్‌కు ఘనంగా నివాళులర్పించారు. 22 ఏళ్లపాటు దేశరక్షణలో సేవలందించిన మనోహర్‌కు గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు.
Updated Date - May 15 , 2025 | 11:26 PM