ఉచిత శిబిరాలతో పేదలకు వైద్యం
ABN, Publish Date - May 11 , 2025 | 11:36 PM
ఉచిత వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వై ద్యం అందజేయడమే లక్ష్యమని జడ్పీమాజీ ఉపాధ్యక్షుడు, డాక్టర్ మన్నె రవీంద్ర అన్నారు. త్రిపురాంతకం మండల కేంద్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం రవీంద్ర, రామకిష్ణారెడ్డి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఆఽధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
500 మందికి పరీక్షలు,
మందుల పంపిణీ
ఎర్రగొండపాలెం, మే 11 (ఆంధ్రజ్యోతి) : ఉచిత వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వై ద్యం అందజేయడమే లక్ష్యమని జడ్పీమాజీ ఉపాధ్యక్షుడు, డాక్టర్ మన్నె రవీంద్ర అన్నారు. త్రిపురాంతకం మండల కేంద్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం రవీంద్ర, రామకిష్ణారెడ్డి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఆఽధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ రవీంద్ర మట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో ఎక్కువ మంది పేద ప్రజలు చికిత్స పొందాలన్నారు. ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలా్ట్ర సౌండ్ పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు చేసినట్లు రవీంద్ర తెలిపారు. డాక్టర్ రవీంద్ర విస్సా ఎక్స్‌లెంట్ అవార్డ్‌ను అందుకున్న ఫొటో ఫ్రేమ్‌ను డాక్టరు ఎం.శ్రీనివాసరావు రవీంద్రకు బహూక రించారు. న్యూరో సర్జన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైద్య శిబిరంలో ఆధునిక పరీకరాలతో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కార్డియాలజిస్టు అంజిత్, చర్మ వ్యాధుల నిపుణులు సిందూర, ఎముకల వ్యాధి నిపుణుడు లక్ష్మీనారాయణరెడ్డి, జనరల్ మెడిసిన్ శేషయ్య వైద్య శిబిరంలో రోగులను పరీక్షించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:36 PM