నలుగురు నిందితులు పోలీసు కస్టడీకి
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:44 PM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన వీరయ్య చౌదరి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.
ఒకరి ఇంట్లో డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు
ఒంగోలు క్రైం, జూన్ 24(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన వీరయ్య చౌదరి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన పాత్రధారి బోర్లుగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావు, గోళ్ల రూ త్వేంద్రబాబు, ఓబిలి నాగరాజులను మంగళవారం ఉదయం 10.30కి జిల్లా జైలు నుంచి పోలీసు కస్టడీకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈనెల 27 సాయంత్రం వరకు న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించనున్నారు. ఒంగోలులో ఉన్న నిందితుడు వినోద్ ఇంట్లో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
Updated Date - Jun 24 , 2025 | 11:44 PM