ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముమ్మర వేట

ABN, Publish Date - Apr 30 , 2025 | 01:27 AM

టీడీపీ నేత వీరయ్యచౌదరిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు చీమకుర్తి బైపాస్‌లోని ఓ హోటల్‌ సమీపంలో స్కూటీని పార్కు చేసి విజయవాడ - కనిగిరి బస్సు ఎక్కి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. వారు కనిగిరి శివారు ప్రాంతంలో దిగినట్లు నిర్ధారణ అయ్యింది.

వీరయ్య కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న ఎస్పీ దామోదర్‌ (ఫైల్‌)

వీరయ్య హత్య కేసులో నిందితుల కోసం గాలింపు

విచారణాధికారిగా ఒంగోలు డీఎస్పీ

ఆన్‌లైన్‌ లావాదేవీలపై దృష్టి

దుండగులు కనిగిరి శివారు ప్రాంతంలో బస్సు దిగినట్లు గుర్తింపు

ఒంగోలు క్రైం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ నేత వీరయ్యచౌదరిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు చీమకుర్తి బైపాస్‌లోని ఓ హోటల్‌ సమీపంలో స్కూటీని పార్కు చేసి విజయవాడ - కనిగిరి బస్సు ఎక్కి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. వారు కనిగిరి శివారు ప్రాంతంలో దిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ రోజు విధుల్లో ఉన్న బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లను పోలీసులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. అదేసమయంలో హంతకులు పొరుగు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారికి నేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రధానంగా వారిపై ఏమి కేసులు ఉన్నాయి? అనే కోణంలో కూడా పోలీసులు సమాచారాన్ని సేకరించారు. కేసులో సూత్రధారులు, పాత్రధారుల మధ్య ఆన్‌లైన్‌ లావాదేవీలపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఒకవైపు నిందితుల కోసం వేట సాగిస్తూనే మరోవైపు అన్ని కోణాల్లోనూ లోతైన దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే కేసులో సూత్రధారులగా భావిస్తున్న వారి బ్యాంక్‌ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఎవరెవరు ఎంత నగదు హంతకులకు జమ చేశారు? ఎవరి వాటా ఎంతా? అన్న విషయంలో ఒక అంచనాకు పోలీసులు వచ్చారు. అదేసమయంలో కేసును ఒంగోలు తాలూకా సీఐ నమోదు చేయగా తాజాగా ఒంగోలు డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ ఆదేశాలు ఇచ్చారు.

మూడు నెలలు కిందటే పథకం

వీరయ్య చౌదరి హత్యకు మూడు నెలల కిందటే పథకం రూపొందించినట్లు పోలీసు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒంగోలులో వారంరోజులు పాటు హంతకులు మకాం వేసి రెక్కీ నిర్వహించారు. ప్రధాన సూత్రధారులుగా ఉన్న వారు ఆర్థిక సహకారం అందించారనేది ప్రాఽథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. అయితే వారి వాటాలు ఎంత అనే కోణంలో బ్యాంక్‌ లావాదేవీలపై దృిష్టి సారించారు. సూత్రధారులలో ఇసుక, రేషన్‌ మాఫియా వారు ఉన్నారన్న నిర్ధారణకు వచ్చారు. వీరిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికి అత్యంత గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారు. వారి దందాకు వీరయ్య చౌదరి అడ్డుకట్ట వేస్తున్నారనే ఆయన మీద కక్ష పెంచుకున్నారు. అందుకే అంత కిరాతకంగా అంతమొందించారనే ప్రచారం ఉంది. పీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ పదవి వీరయ్యకు వస్తే ఆయనకు గన్‌మన్లు ఉంటారు, అందుకే ముందుగా హత్య చేశారని, అది కూడా పథకంలో భాగమేనని పోలీసుల విచారణలో వెల్లడైంది.


కీలకం ఇసుక వ్యాపారి

సూత్రధారులు, నిందితుల మధ్య కీలకంగా ఇసుక వ్యాపారి వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇసుక వ్యాపారి బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఇద్దరు కలిసి విశాఖపట్నంలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి కూడా ఇసుక వ్యాపారి పరారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇసుక వ్యాపారి దొరికితేనే కేసులో కీలకమైన సమాచారం బయటపడే అవకాశం ఉంది. పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ స్వయంగా సమాచారం తెప్పించుకుంటూ, అవసరమైన సూచనలు ఇస్తున్నారు. అతిత్వరలో కేసును పూర్తిస్థాయిలో ఛేదిస్తామనే ధీమాలో పోలీసులు ఉన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 01:27 AM