రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ABN, Publish Date - Jun 06 , 2025 | 10:44 PM
రైతులు వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతకతను అందిపుచ్చుకోవాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం నోడల్ ఆఫీసర్ కె.సంధ్యారాణి అన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో వికసిత్ కృషి సం కల్ప అభియాన్‌లో భాగంగా శుక్రవారం రైతులకు ఖరీఫ్ పంటలకు మందుస్తుగా అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశా రు.
కృషి విజ్ఞాన కేంద్రం
నోడల్ ఆఫీసర్ సంధ్యారాణి
పెద్దారవీడు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతకతను అందిపుచ్చుకోవాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం నోడల్ ఆఫీసర్ కె.సంధ్యారాణి అన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో వికసిత్ కృషి సం కల్ప అభియాన్‌లో భాగంగా శుక్రవారం రైతులకు ఖరీఫ్ పంటలకు మందుస్తుగా అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ఉన్నతికి అమలు చే స్తున్న పీఎం కిసాన్, ఫసల్ బీమా యోజన, కిసాన్ మన్ థన్ యోజ న, వ్యవసాయ
సదుపాయాల నిధి వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా నోడల్ ఆఫీసర్, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ జి.రమేష్ మాట్లాడుతూ రైతులు ముఖ్యంగా మిరప, కంది, పెసర సాగుకు ముందు విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పురుగులు, తెగుళ్లను నివారించుకోవచ్చన్నారు. భూ లోపాలను గుర్తించి, సారవంతం చేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పురుగుమందుల పిచికారీకి డ్రోన్‌లను విని యోగించుకోవాలన్నారు. హైదరాబాద్ కోళ్ల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి.ప్రకాష్ మాట్లాడుతూ కోళ్ల రకాలు, వాటి పోషక విలువలు, వచ్చే వాధులను వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆదిరెడ్డి, కేవీకే సిబ్బంది, అనుబంధ శాఖ ల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 10:44 PM