ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మిరప సాగుకు సిద్ధమైన రైతులు

ABN, Publish Date - Jul 20 , 2025 | 11:38 PM

మండలంలో మిరప సాగుకు రైతులు సిద్ధమయ్యారు. వాతావరణంలో మార్పులు కారణంగా కురిసిన మోస్తరు వానకు తమ భూములను బాగు చేసుకుంటున్నారు. పైగా ఖరీ్‌ఫలోని ముఖ్యమైన పైర్లు మిరప, కంది, ఆముదాలు, మొక్కజొన్న తదితరాల సాగుకు పదును కావడంతో వ్వవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

పొలంలో ఉన్న నారు మడులు

పెరిగిన నారుమడుల ఖర్చు

గిట్టుబాటు ధరలపైనే ఆశలు

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు

పెద్ద దోర్నాల, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలో మిరప సాగుకు రైతులు సిద్ధమయ్యారు. వాతావరణంలో మార్పులు కారణంగా కురిసిన మోస్తరు వానకు తమ భూములను బాగు చేసుకుంటున్నారు. పైగా ఖరీ్‌ఫలోని ముఖ్యమైన పైర్లు మిరప, కంది, ఆముదాలు, మొక్కజొన్న తదితరాల సాగుకు పదును కావడంతో వ్వవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉదాసీన వైఖరితో ఉన్న రైతుల్లో కొంత ఉత్సాహం ఏర్పడింది. ఈ సీజన్‌కు అదను దాటి పోతుందని ఏదైతే అదైందని ముందు భూములను బీళ్లుగా ఉంచితే ప్రతి సారీ దున్నకం పనులు చేస్తూ అదనపు ఖర్చు వస్తుంది. ఏదొక పైరు వేస్తే అవేసేధ్యం ఖర్చులతో పంటలు తీయొచ్చని సాగుకు ఉపక్రమించారు. పలువురు రైతులు కంది విత్తుతుండగా మరికొందరు మొక్కజొన్న వేస్తున్నారు.

అధిక విస్తీర్ణంలో మిరప

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం రైతులు వాణిజ్య పంటల్లో అధిక శాతం మంది మిరప సాగుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలో ఎక్కువ మంది మిరప విత్తనాలు కొనుగోలు చేసి తమ భూముల్లోనే మడులు తయారు చేసుకుని స్ర్పింకర్ల ఏర్పాటుతో నార్లు పోసుకుంటున్నారు. దీంతో పొలం దగ్గరే నారు అందుబాటులో ఉంటుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. మరికొందరు విత్తనాలు కొనుగోలు చేసి షేడ్‌ నెట్లలో యజమానులతో మాట్లాడి మొక్కకు రూ.30 నుంచి 50పైసల చొప్పున నారు పోయిస్తున్నారు. తద్వారా కొంత ఖర్చయినా 45 రోజుల పాటు నారు ఆలనా పాలనా వారే చూస్తారు. ఇంకొందరు వర్షాలు బాగా కురిసి కాలం మిరపకు అనుకూలంగా ఉంటే అప్పుడే షేడ్‌ నెట్లలో కొనుగోలు చేసి నాటుకోవచ్చని భావనతో ఉన్నారు. ప్రధాన పొలాలను నాట్లు వేసుకునేందుకు సారవంతం చేసుకుంటున్నారు.

నారుమడుల ఖర్చు

ఎకరం మిరప సాగుకు పది గ్రాముల తూకంతో ఉన్న పది ప్యాకెట్లు అవసరమవుతాయి. రకాన్ని బట్టి ప్యాకెట్‌ ధర రూ.250 నుంచి రూ.420 వరకు పలుకుతున్నాయి. పది ప్యాకెట్లు రూ.2500 నుంచి రూ.4200 వరకు ఖర్చవుతుంది. ముగ్గురు కూలీలు రూ.300 చొప్పున రూ.900 మడులు తయారీకి రూ.1,000, స్ర్పింకర్లు రూ.1,000, ఎరువు, పురుగు మందుల ఖర్చు రూ.2,000 మొత్తంగా రూ.7,000 పైమాటే. షేడ్‌ నెట్లలో 15000 మొక్కలకు రూ.40పైసల చొప్పున రూ.6,000 చెల్లించాలి. విత్తనాల ఖర్చు రూ.4,000, పొలానికి రవాణా ఖర్చు రూ.1,000, మొత్తంగా రూ.11,000 ఈ విధానంలో 45 రోజులు సమయం దాటితే వాతావరణం ఎలా ఉన్నా నారు విధిగా తెచ్చుకోవాలసి ఉంటుంది.నేరుగా షేడ్‌ నెట్లలో కొనుగోలు చేస్తే మొక్క అప్పటి పరిస్థితుల ఆధారంగా ధరలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. రూ.80 పైసల నుంచి రూ.1.50 వరకు ఉండొచ్చు. రవాణా ఖర్చులతో ఎకరానికి రూ.15,000 పైగా అవసరమవుతాయి. అయితే విత్తనాల నాణ్యతలో కచ్చితత్వం ఉండదు.

గిట్టుబాటు ధరలతోనే యాతన

మిరప సాగుకు రైతులు ఎంతగా కష్టపడతారో అంతగా ఇష్టపడతారు. ఏడాది పాటు వివిధ తెగుళ్లు, నీటి ఎద్దడి, వాతావరణంలో మార్పులు వల్ల కలిగే ఇబ్బందులను ఎదుర్కొని పండించిన పంటకు గిట్టుబాటు ధర కీలకం. అదే లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. గతేడాది ఇతే జరిగింది. మునుపెన్నడూ ఇలాంటి ధరలు చూడలేదని రైతులు వాపోతున్నారు. ఎకరం సాగు ఖర్చులో సగం కూడా రాక పోతే ఎన్నడు కోలుకోవాలి. కాయలు కోసిన కూలీలకు కూడా చెల్లించలేని ధుస్థితి నెలకొంది. చాలా మంది కాయలను ఆధరలకు అమ్మేందుకు ఇష్టం లేక శీతల గిడ్డంగులలో నిల్వ చేశారు. నేటికీ ధరలు పెరగలేదు. ఆ కాయలు అమ్మనూలేదు. తెచ్చిన అప్పుకు వడ్డీ పెరుగుతోంది. నిల్వ చేసిన కాయలకు బాడుగ చెల్లించలేక గగ్గోలు పెడుతున్నారు. పొలం చేసే కన్నా కూలీకి వెళ్లడం మంచిదని పలువురు రైతు లు తమ భూములను ఈ ఏడాది కౌలుకు ఇస్త్తున్నారు. అయినా అడిగేవారు లేరు. నిరుడు ఎకరం కౌలు రూ.54వేలు చెల్లించిన వారు ఇప్పుడు రూ15వేలకు అడుగుతున్నారు. గతేడాది మార్చిలో ప్రభు త్వం క్వింటాకు రూ1,740 కలిపి ఇస్తామని ప్రకటించింది. ఏ ఒక్క రైతుకు చెల్లింపులు జరగలేదని రైతులు ఆరోపిస్త్తున్నారు. ఈ ఏడాదైనా మిరపకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కనీసం క్వింటా ధర రూ.18,000 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తున్నారు.

వాన కురిసింది.. సాగు మొదలైంది

పత్తి, కందిపై రైతుల ఆసక్తి

ఎర్రగొండపాలెం రూరల్‌ : ఖరీప్‌ సాగు ప్రారంభమై రోజులు గడుస్తున్న వరుణ దేవుడు మాత్రం కరుణించ లేదు. ఎట్టకేలకు శుక్ర, శనివారాలలో మండలం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేసింది. సాగు చేసుకునేందుకు, సాగు చేసిన పొలాలకు ఉపకరించింది. దీంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని గోళ్లవిడిపి, అయ్యంబొట్లపల్లి, గురిజేపల్లి, వీరభద్రాపురం, తమ్మడపల్లి, వాదంపల్లి, గంగుపల్లి, మిల్లంపల్లి గ్రామాలతో పాటు తదితర గ్రామాలలో రైతులు దుక్కి దున్ని పత్తి, కంది తదితర పంటలు సాగు చేస్తున్నారు. గోళ్లవిడిపి గ్రామానికి చెందిన పొలేబోయిన విష్ణువర్ధన్‌ తన 5 ఎకరాల పొలాన్ని ఎద్దులతో దుక్కి దున్ని పత్తి విత్తనాలు విత్తున్నట్లు ఆదివారం తెలిపారు. పత్తి, మిరప, మొక్కజొన్న, బొప్పాయి, ఆరటి పంటలకు ఎంతో మేలు చేసిందని రైతులు చెప్తున్నారు.

పంటల సాగుకు సిద్ధపడుతున్న రైతులు

రాచర్ల : పంటల సాగుకు రైతులు సిద్ధపడతున్నారు. వరి, మిరప, కంది పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. మే చివర్లో జూన్‌ ప్రారంభంలో కురవాల్సిన వర్షాలు సకాలంలో కురవకపోవడంతో అదును తప్పిపోవడంతో రైతులు సకాలంలో పంటలు వేయలేదు. వర్షాలు లేక దిగాలు పడి ఉన్న రైతులకు రెండు రోజులుగా కొద్దిపాటి వర్షాలు కురవడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. వరి, మిరప, టమాటా తదితర పంటలు సాగుకు పరిస్థితులు అనుకూలించడంతో వాటిపై రైతులు మొగ్గుచూపుతున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:38 PM