ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చందలూరు కొండ పోరంబోకు నకిలీ పట్టాలు రద్దు

ABN, Publish Date - May 14 , 2025 | 11:37 PM

దర్శి మండలంలోని చందలూరు కొండభూమికి కొంతమంది అక్రమార్కులు పొందిన నకిలీ పట్టాలను జిల్లా రెవెన్యూ అధికారులు రద్దు చేశారు.

నకీలీ పట్టాలు రద్దు చేసిన చందలూరు కొండపోరంబోకు భూమి ఇదే

దర్శి, మే 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని చందలూరు కొండభూమికి కొంతమంది అక్రమార్కులు పొందిన నకిలీ పట్టాలను జిల్లా రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. ఇందుకు సంబంధించి గతంలో ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురిమైంది. చందలూరు రెవెన్యూలోని 787 సర్వేనెంబర్‌లో 1,400 ఎకరాల కొండభూమి ఉంది. ఆందులో కొంతమంది గుంటూరు జిల్లాకు చెందిన అక్రమార్కులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌ చేయించుకొని పట్టాలు సృష్టించుకున్నారు. ఆ తర్వాత కొండభూమిలో దిగి చెట్లుకొట్టి మొక్కలు నాటారు. కొన్నిచోట్ల బోర్లు కూడా వేశారు. కొండభూమిని అక్రమంగా సాగు చేసుకుంటున్న వారిని చందలూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తమకు పట్టాలు ఉన్నాయని అక్రమార్కులు బుకాయించారు. చందలూరు గ్రామస్థులు కొండపోరంబోకు కబ్జా చేసి నకిలీ పట్టాలు సృష్టించుకున్న విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేశారు. అ అవినీతిపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించటంతో రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రికార్డులు పరిశీలించి కొండభూమికి సంబంధించి ఎలాంటి పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు లేవని ఉన్నతాఽధికారులకు నివేదికలు పంపారు. దీంతో జిల్లా అధికారులు కొద్ది రోజుల క్రితం ఆ పట్టాలను రద్దుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో చందలూరు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 14 , 2025 | 11:37 PM