ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భీమేశ్వరస్వామి ఆలయంలో తవ్వకాలు

ABN, Publish Date - Aug 04 , 2025 | 01:28 AM

మండ లంలోని ధర్మవరం భీమలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి తవ్వకాలు జరి పారు.

అద్దంకి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని ధర్మవరం భీమలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి తవ్వకాలు జరి పారు. సామాన్యశకం 8వ శతాబ్దానికి పూర్వం నాటి దేవాలయంగా భావిస్తున్న ధర్మవరం సమీపంలోని భీమలింగేశ్వరస్వామి దేవాల యంలో గుప్త నిధుల కోసం ఇప్పటికే 10 సార్లుకుపైగా తవ్వకాలు చేపట్టినట్లు తెలు స్తోంది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో కూడా తవ్వకాలు జరిగాయి. ఆరేడు సంవత్సరాల క్రితం దేవాలయం లోపల శివలింగం ఉన్న ప్రాంతంలో కూడా తవ్వకాలు చేశారు. శని వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వ కాలు చేపట్టారు. దేవాలయం ముందు భాగం లోని నాపరాళ్లను తొలగించి తవ్వకాలు చేసినట్లు భావిస్తున్నారు. బయట పడ్డ బండ రాళ్లను సమీపంలో పడవేశారు. అనంతరం మరలా నాపరాళ్ళు యదావిధిగా పరిచి సిమెంట్‌ పూత పూసారు. ఆదివారం ఉదయం దేవాలయానికి వెళ్లిన భక్తులు తవ్వకాలు జరిగి న విషయాన్ని గమనించి దేవాదాయ శాఖ అధికా రులకు తెలియజేశారు. అద్దంకి గ్రూపు దేవస్థానా ల ఈవో శైలేంద్రకుమార్‌, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతి పురాతన దేవాల యం కావడంతో గుప్త నిధులు ఉన్నాయన్న ఆలోచనతో తరచూ తవ్వకాలు జరుపు తున్నట్లు తెలు స్తోంది. పంచపాండవులు ధర్మవరం సమీపంలో 5 శివలింగాలను ప్రతిష్టించి దేవాలయాల నిర్మాణం చేపట్టారు. భీముడు ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో భీమ లింగేశ్వరస్వామి దేవాలయంగా పిలుస్తు న్నారు. భీమలింగేశ్వరస్వామి దేవాలయంలో శివలింగం నేలపైన మూడు అడుగుల ఎత్తు ఉండగా, భూమి లోపల మరో అడుగులు ఉన్నట్లు భక్తులు చెబుతున్నారు. భీమ లింగేశ్వరస్వామి దేవాలయం పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి త్వరలో సుమారు రూ.1.50 కోట నిధులు మంజూరుకు మంత్రి రవికుమార్‌ కృషి చేస్తున్నారు.

Updated Date - Aug 04 , 2025 | 01:28 AM