ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంతా గందరగోళం

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:15 AM

ప్రాథమిక పాఠశాలలకు ఎస్జీటీల కేటాయింపులో విద్యాశాఖ అధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారు. మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూళ్లలోని ప్రాథమిక తరగతులకు ప్రతి పది మందికి ఒకరు చొప్పున టీచర్లను కేటాయించారు. అదే ఫౌండేషన్‌ స్కూళ్లు, బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లలో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30మందికి ఒక ఎస్జీటీని ఇవ్వడం ఎక్కడి హేతుబద్ధత అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒంగోలు ప్రకాశం భవన్‌లోని డీఈవో కార్యాలయం

టీచర్ల హేతుబద్ధీకరణలో లోపించిన సమతుల్యం

కొన్ని ప్రాథమిక పాఠశాలలపై వివక్ష

యూపీలకు ఎస్జీటీలే దిక్కు

ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల గరంగరం

ప్రాథమిక పాఠశాలలకు ఎస్జీటీల కేటాయింపులో విద్యాశాఖ అధికారులు తీవ్ర వివక్ష చూపుతున్నారు. మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూళ్లలోని ప్రాథమిక తరగతులకు ప్రతి పది మందికి ఒకరు చొప్పున టీచర్లను కేటాయించారు. అదే ఫౌండేషన్‌ స్కూళ్లు, బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లలో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30మందికి ఒక ఎస్జీటీని ఇవ్వడం ఎక్కడి హేతుబద్ధత అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైస్కూళ్లలో అయితే మరీ విడ్డూరంగా పది మందికే ఇద్దరు టీచర్లను కేటాయించడంలోని ఔచిత్యాన్ని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక తరగతులు ఉన్న పాఠశాలలకు పేరు ఏదైనా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించాలని పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఒంగోలు విద్య, ఏప్రిల్‌ 26 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో ఉపాధ్యాయుల హేతుబ ద్ధీకరణపై గందరగోళం నెలకొంది. వివాదా స్పద 117 జీవో అనంతరం పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, టీచర్ల పునర్విభజన విషయంలో ఇంకా సందిగ్ధం కొనసాగు తోంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు పూటకో నిర్ణయం తీసుకుంటూ ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారు. పాఠశాలల ఏర్పాటు, టీచర్ల కేటాయింపులకు సంబం ధించి ఇప్పటికి మూడుసార్లు నిబంధనలు మారిపోవడంతో ఈ ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ సోమవారం నుంచి ప్రారంభమైనప్ప టికీ పాఠశాలలపై ఇంకా ఒక స్పష్టత కరువైంది. 117 జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో సంబరపడిన టీచర్లకు అనంతరం జరుగుతున్న పరిణా మాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాఠశాలలకు టీచర్లను కేటాయించడంలో హేతుబద్ధత లోపించిందని ఉపాఽధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5 తరగతుల పాఠశాలలకు టీచర్ల కేటాయింపులో వివ క్షను వేలెత్తి చూపుతున్నారు. యూపీ స్కూ ళ్లకు సెకండరీ గ్రేడ్‌ల కేటాయింపు పట్ల కూడా టీచర్లు భగ్గుమంటున్నారు. 3, 4, 5 తరగతులను తొలగిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కొన్ని హైస్కూళ్లలో 1 నుంచి 10 తరగతులు నిర్వహించేందుకు పూనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

పోస్టుల కేటాయింపులో వివక్ష

ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5 తరగ తుల విద్యార్థులకు వివిధ పేర్లతో ఏర్పాటు చేస్తున్న ప్రాథమిక పాఠశాలలకు టీచర్ల కేటాయింపులో హేతుబద్ధత పూర్తిగా లోపించింది. ప్రభుత్వ మానస పుత్రికగా ఏర్పాటవుతున్న మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూళ్లలో 1 నుంచి 5 తరగతులకు టీచర్ల కేటాయింపులో చూపిన శ్రద్ధ ఇతర పాఠశాలల పట్ల ప్రదర్శించకుండా వివక్ష చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

జూ 1, 2 తరగతులు ఉండే ఫౌండేషన్‌ స్కూళ్లకు 1 నుంచి 30 మంది పిల్లలు వరకు ఒక ఎస్జీటీ, 31 నుంచి 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను కేటాయిస్తున్నారు.

జూ 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు ఉండే బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లకు 1 నుంచి 20 మంది వరకు 1 ఎస్జీటీ, 21 నుంచి 60 మంది వరకు ఇద్దరు ఎస్జీటీలను నియమిస్తారు.

మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు 59 మంది విద్యార్థుల వరకు 1 ప్రైమరీ స్కూలు హెచ్‌ఎం, మూడు ఎస్జీటీలను కేటాయిస్తున్నారు.

60 నుంచి 150 మంది విద్యార్థులు ఉన్న మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు 1 ప్రైమరీ స్కూలు హెచ్‌ఎం, నలుగురు ఎస్జీటీలను ఇస్తున్నారు. 150 మంది పిల్లల తర్వాత ప్రతి 30మందికి ఒక ఎస్జీటీ అదనంగా కేటాయిస్తారు. ఎస్జీటీలు మిగులుగా ఉంటే 120 నుంచి 150 మందికి ఒక ఎస్జీటీని అదనంగా ఇస్తారు. ప్రైమరీ స్కూలు హెచ్‌ఎం పోస్టు లేని మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు మిగులుగా తేలుతున్న స్కూలు అసిస్టెంట్లను హెచ్‌ఎంలుగా నియమించనున్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు బేసిక్‌ ప్రైమరీ స్కూలు/ మోడల్‌ ప్రైమరీ స్కూలు నిబంధనల ప్రకారం ఎస్జీటీలను కేటాయిస్తారు.

హైస్కూళ్లలోని 1 నుంచి 5 తరగతులకు పది మంది వరకు పిల్లలకు ఇద్దరు ఎస్జీటీలు, 11 నుంచి 30 మందికి మూడు ఎస్జీటీలు, 31 నుంచి 40 మందికి నాలుగు ఎస్జీటీలను ఇస్తున్నారు. 40 మందిపైన ఉంటే ఒక పీఎస్‌హెచ్‌ఎం, నాలుగు ఎస్జీటీలను కేటాయిస్తున్నారు.


యూపీలకు ఎస్జీటీలే దిక్కు

ప్రాథమిక పాఠశాల్లో చదువుతున్న 6, 7, 8 తరగతుల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెకండరీ గ్రేడ్‌ టీచర్లు మాత్రమే బోధించనున్నారు. ప్రస్తుతం యూపీ స్కూళ్లలో పనిచేస్తున్న స్కూలు అసిస్టెంట్లను మిగులు టీచర్లుగా గుర్తించి వారిని అవసరం ఉన్న హైస్కూళ్లకు సర్దుబాటు చేయనున్నారు. జిల్లాలోని 180 యూపీ స్కూళ్లు, 59 పాఠశాలలు హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ కాగా 57 యూపీ స్కూళ్లను యఽథాతథంగా కొనసాగించనున్నారు. మిగిలిన వాటిని బేసిక్‌ ప్రైమరీ, మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా డౌన్‌గ్రేడ్‌ చేశారు. హైస్కూళ్లలో 6, 7, 8 తరతగతులకు స్కూలు అసిస్టెంట్లు బోధి స్తుండగా యూపీ స్కూళ్లలో మాత్రం ఎస్జీటీలే పాఠాలు చెప్పనున్నారు. అదే యూపీ స్కూళ్లకు అరకొరగా ఎస్జీటీలను కేటాయిస్తున్నారు. 1 నుంచి 10 మందికి ఒక ఎస్జీటీ, 11 నుంచి 30 మందికి ఇద్దరు, 31 నుంచి 140 మందికి నలుగురు, 141 నుంచి 175 మందికి ఐదుగురు ఎస్జీటీలను కేటాయిస్తున్నారు. 30 మందిలోపు పిల్లలు ఉన్న యూపీ స్కూళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఇద్దరు ఎస్జీటీలు 6, 7, 8 తరగతులకు ఒక్కోదానిలో ఏడు సబ్జెక్టులు బోధించడం సాధ్యమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతు న్నాయి. విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందిస్తామంటున్న ప్రభుత్వ ప్రకటనకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది.

Updated Date - Apr 27 , 2025 | 01:15 AM