ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN, Publish Date - May 17 , 2025 | 10:52 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర - స్వ ర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పట్ట ణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి సెంటరులో జరిగిన మానవహారంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మే 17 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర - స్వ ర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పట్ట ణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి సెంటరులో జరిగిన మానవహారంలో ఆయన మాట్లాడారు. వాయుకాలుష్య నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, వాటి వాడకం నియంత్రించాలని కోరారు. భూమి పొరలను ప్టాస్టిక్‌ దెబ్బతీస్తూ వృక్షాల పెరుగుదలకు విఘాతం కల్పింస్తుం దన్నారు. భూమి నుంచి సెగలు పెరిగి నానాటికి ఉష్ణోగ్రత శాతం పెరిగిపోయి ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. వేసవిలో ఎండలు విపరీతంగా ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు ఆరోగ్యహితమైన పండ్ల రసాలు, మజ్జిగ, నిమ్మరసాలు వంటివి సేవించాలన్నారు. వడదెబ్బ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈసందర్భంగా పామూరు బస్టాండు షెల్టర్‌లో పాదచారులకు, ప్రయా ణికులకు మజ్జిగ పంపి ణీ చేశారు. మానవతా సంస్థను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రజాహితం కోసం సేవ చేయాలని పిలు పునిచ్చారు. ప్రతిఒక్క రూ విధిగా విరివిగా మొక్కల నాటాలని ఎమ్మెల్యే కోరారు. పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఆర్డీవో శివరామిరెడ్డి, తహసీ ల్దార్‌ రవిశంకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జోసఫ్‌ దానియేలు, అంగన్‌వాడీ సూపర్‌వైజ ర్‌ పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 10:52 PM