ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:47 PM

కనిగిరి పట్టణ పరిశుభ్రతలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్వర్ణాం ధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ సమీ పంలోని కొత్తూరు బైపాస్‌ కూడలి వద్ద అధికారులు, వివిధశాఖల సిబ్బందితో మానవహారం నిర్వహించా రు.

ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర, అధికారులు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కనిగిరి పట్టణ పరిశుభ్రతలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్వర్ణాం ధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ సమీ పంలోని కొత్తూరు బైపాస్‌ కూడలి వద్ద అధికారులు, వివిధశాఖల సిబ్బందితో మానవహారం నిర్వహించా రు. అనంతరం కొత్తూరు నుంచి పామూరు బస్డాం డు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసం దర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ పరిస రాల పరిశుభ్రతతో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలించాల న్నారు. అనంతరం బైపాస్‌ డివైడర్‌లలో మొక్కలు నాటారు

వాగులో పూడిక తొలగింపు

దశాబ్దకాలంగా కొత్తూరు వాగు చప్టా వద్ద ఉన్న తూము పూడికతో పూర్తిగా నిండిపోయి చెత్తా చెదారాలతో దుర్వాసన వస్తుంది. స్వచ్ఛాంధ్ర కార్యక్ర మంలో భాగంగా కొత్తూరు ప్రాంతానికి వచ్చిన ఎమ్మె ల్యే వాగులో ఉన్న పూడికను గమనించారు. మున్సిపల్‌ అధికారులను, సిబ్బందిని వెంటనే పిలిపించారు. వా గులో పూడికను వెంటనే తొలగించాలని మున్సిపల్‌ క మిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డిని ఆదేశించారు. ఎక్స్‌కవేటర్‌ తో వాగులో ఉన్న పూడికను, తూముకు అడ్డంగా ఉన్న చెత్తను తొలగించి మురుగునీరు సక్రమంగా వెళ్లేలా చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన్‌ రెడ్డి, డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్‌ రవిశంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమో హన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, గుడ్‌ హెల్ప్‌ రమేష్‌, బాలు ఓబులురెడ్డి, తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, వివిధ శాఖల అదికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం

కనిగిరి నుంచి విజయవాడకు సూపర్‌ లగ్జరీ బస్సును ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసిం హారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ కనిగిరి డిపో పరిధిలో 51 నూతన బస్సు సర్వీసులను ప్రారంభించినట్టు చెప్పారు. కనిగిరి నుంచి విజయవాడకు కొత్త బస్సులను పెంచినట్లు తె లిపారు. త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా నూతన బస్సులను కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం డిపోలోని టాయిలెట్స్‌ను పరిశీ లించి పరిశుభ్రంగా ఉంచాలని ఆ దేశించారు. కార్యక్రమంలో డీపీ టీవో సత్యనారాయణ, డీఎం ష యానాబేగం, మాల్యాద్రి, మున్సి పల్‌ చైర్మన్‌ గఫార్‌, నంబుల వెంకటేశ్వర్లు యాదవ్‌, కొండ య్య, జంషీర్‌ అహ్మద్‌ తదితరు లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ఒకటో వా ర్డులో ఏడాది సుపరి పాలన తొలిఅడుగు కార్యక్రమం లో పాల్గొని ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను, సంక్షేమ పథకాల అమలును ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర వివరించారు.

2

చిన్నారులతో మాట్లాడుతున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

ఏడాదిలో ఎంతో చేశాం!

ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలే పాలకులని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం దర్శిలోని క్రిష్టియన్‌పాలెంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని వివరించారు. పథకాలు అందుతున్నాయా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకుంటూ కరపత్రాలు పంపిణీచేశారు. ఈసందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో 90 శాతం హామీలను నెరవేర్చిందన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుందని చెప్పారు. సీ ఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో అన్నివర్గాల ప్రజ లు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ స్టీవెన్‌, నాయకులు సంగా తిరుపతిరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

దర్శి, జూలై 19(ఆంధ్రజ్యోతి): దర్శి నియోజకవర్గం లోని 40 మంది బాధితులకు రూ. 24 లక్షలు సీఎం సహాయనిధి చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధరోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న పేదలను సీఎం చంద్రబా బు దయార్ధ హృదయంతో ఆదుకుంటున్నా రన్నారు. అడిగిన వెంటనే బాధితులకు సహాయం అందుతుండ టంతో వారిలో ఆనందం కనిపిస్తుందన్నారు. కార్యక్ర మంలో దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీని వాసులు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, దర్శి పట్టణ అధ్య క్షుడు పుల్లలచెరువు చిన్నా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:47 PM