ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాడపాకులతో ఉపాధి

ABN, Publish Date - Jun 25 , 2025 | 10:10 PM

మేలోనే ఊరించిన రుతుపవనాలు చిరు జల్లులు కురిసి ఉసూరుమపిసించాయి. దీంతో పెద్దగా వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. మండలంలో అధిక శాతం మంది వ్యవసాయం, ఆధారిత కుటుంబాలు ఉన్నాయి.

నల్లమల నుంచి సేకరించిన మాడపాకులను విక్రయానికి తెచ్చిన గిరిజనులు

నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజనుల సేకరణ

విస్తర్లుగా తయారు చేస్తున్న మహిళలు

పెద్ద దోర్నాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : మేలోనే ఊరించిన రుతుపవనాలు చిరు జల్లులు కురిసి ఉసూరుమపిసించాయి. దీంతో పెద్దగా వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. మండలంలో అధిక శాతం మంది వ్యవసాయం, ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. కుటంబ పోషణ ఖర్చు రోజు రోజుకూ పెరిగి పోతూ ఉంది. ఇంటి ఖర్చుతో పాటు పిల్లల చదువులకు, పొలాలు బాగు చేసుకునేందుకు డబ్బు అవసరం. కానీ చేసేందుకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చెంచు గిరిజనులు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మాడపాకులు అందివచ్చిన జీవనోపాధిగా మారింది.

నల్లమలలో మాడపాకుల సేకరణతో ఉపాధి

కుటుంబ పోషణకు ప్రత్యామ్నాయ మార్గంగా నల్లమల అటవీ ప్రాంతంలోని మాడపాకులు సేకరణ ఉపాధి వనరుగా మారాయి. నల్లమలలో మాడపాకులు విస్తారంగా ఉన్నాయి. ఈ ఏడాది మేలో కురిసిన వానకు మరింత విస్తరించాయి. దీంతో అటవీ ప్రాంతంలో నివశించే చెంచు గిరిజనులకు మంచి ప్రోత్సాహం లభించినట్లయిం ది. అటవీ ప్రాంతంలో మాడపాకులు సేకరించి మైధాన ప్రాంతాలలో గ్రామాల్లోకి వెళ్లి విక్రయిస్తారు. 10 కేజీలు రూ.300లుగా ధర నిర్ణయించారు. వచ్చిన సొమ్ముతో కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నారు.

విస్తర్ల తయారీతో మహిళలకు తోడ్పాటు

అటవీ ప్రాంతంలో సేకరించిన మాడపాకులను గ్రామాల్లోని మహిళలు కొనుగోలు చేసి విస్తర్లుగా తయారీ చేయడం ద్వారా ఉపాధిని పొందుతున్నారు. గిరిజనుల నుంచి 10 కేజీల ఆకులను రూ.300కు కొని తాళ్లకు కుట్టి ఎండలో ఆరబెట్టి వాటిని విస్తర్లుగా తయారు చేసి (98 ఆకులు) కట్ట రూ.160 ధరకు విక్రయిస్తారు. 10 కేజీలకు 3 కట్టలు తయారవుతాయి. పెట్టుబడి పోను రూ.150 వరకు మిగులుతాయి. విస్తర్లు తయారు చేసే పనిని బట్టి ఆదాయం ఉంటుంది. అయితే ఎక్కువ సమయం విస్తర్లు కుడితే వెన్ను నొప్పి, అధిక వేడి కలుగుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం కొద్ది సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ శాతం రైతులు, రైతు కూలీలు కావడంతో వాన కోసం ఎదురు చూస్తున్నారు. మెండుగా వర్షాలు కురిసి పొలం పనులు ముమ్మరమైతే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 10:10 PM