ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పారదర్శకంగా ఉపాధి పనులు చేపట్టాలి

ABN, Publish Date - May 13 , 2025 | 10:58 PM

గ్రామాల్లో అత్యంత పారదర్శకంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ఏపీవోలు, ఈసీలు, టీఏలు, సీవోలతో సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం, మే 13 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో అత్యంత పారదర్శకంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ఏపీవోలు, ఈసీలు, టీఏలు, సీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జోస్‌ఫ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలన పనిచేసిన వారి వాసనలు ఇంకా చాలామంది అధికారులు, సిబ్బందికి పోలేదన్నారు. తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తుంటామన్నారు. పనితీరు మెరుగుపర్చుకోకుంటే ఉద్వాసన తప్పదన్నారు. ప్రతి కుటుంబానికి తప్పక పని చూపాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో మార్కాపురం నియోజకవర్గం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచేలా పనిచేయాలన్నారు. డ్వామా పీడీ జోస్‌ఫ కుమార్‌ మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించేలా పనిచేయాలన్నారు. అంతేకాక వారికి వేతనాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకున్నా సహించేదిలేదన్నారు. సామాజిక తనిఖీల్లో ఎలాంటి అవినీతి బయట పడినా రికవరీతోపాటు ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 10:58 PM