ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సోలార్‌ హబ్‌ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగు

ABN, Publish Date - Jun 28 , 2025 | 11:33 PM

ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుందని దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు.

సోలార్‌ హబ్‌ ఏర్పాటుపై రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావాలి

సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్‌ నాయుడు

బల్లికురవ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుందని దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. మండలంలోని ఎస్‌ఎల్‌ గుడిపాడు పంచాయతీ శివారు సుజాత నగర్‌ వద్ద శనివారం ఆర్డీవో సోలార్‌ హబ్‌ ఏర్పాటుకు భూసేకరణ చేసేందుకు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఎస్‌ఎల్‌ గుడిపాడు, ముక్తేశ్వరం గ్రామాలకు చెందిన పలువురు రైతుల వద్ద సుమారు 390 ఎకరాల భూములు సోలార్‌ హబ్‌కు అవసరమని, రైతులు ముందుకు వచ్చి ఇస్తే పరిశ్రమ ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రభుత్వం భూములకు ఉన్న విలువ కంటే రెండున్నర రెట్ల అధికంగా రైతులకు నగదు అందజేస్తుందన్నారు. రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే కలెక్టర్‌ వద్ద సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పష్టమైన వివరణ ఇస్తామన్నారు. సోలార్‌ హబ్‌ ఏర్పాటు చేస్తే గ్రామాలలో ఉన్న భూములకు కూడా విలువ పెరుగుతుందని, గ్రామాలుకూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అనంతరం సంతమాగులూరు మండలంలోని మామిళ్లపల్లి, కుందుర్తి గ్రామాలలో కూడా సోలార్‌ హబ్‌ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై ఆర్డీవో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు రవినాయక్‌, రవిబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌, అర్‌ఐ పోతురాజు, వీఆర్వో యాకోబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:33 PM