మెరుగైన రవాణ సౌకర్యాల కల్పనకు కృషి
ABN, Publish Date - Apr 24 , 2025 | 10:41 PM
ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడి అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ డిపోలో నూ తన బస్సులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువ శాతం బెంగుళూరు ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్తుంటారన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడి అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ డిపోలో నూ తన బస్సులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువ శాతం బెంగుళూరు ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్తుంటారన్నారు. ఇందుకోసం పీసీ పల్లి మండలంలోని ఇర్లపాడు నుంచి బెంగుళూ రుకు నేరుగా సూపర్‌లగ్జరీ బస్సును నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు. కనిగిరి నుంచి విజయవా డకు మరో ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను ప్రారంభించామన్నారు. దీంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడు తుందన్నారు. కనిగిరి ప్రాంతంలో త్వరలోనే రైలు మా ర్గం పూర్తి కానుందని చెప్పారు. దీంతో రైలు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు కానుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం షయనాబేగం, మున్సిపల్ కమిషనర్ జోసఫ్ దానియేలు, చైర్మన్ గపార్, తహసీల్దార్ రవిశంకర్, జనసేన ఇన్‌చార్జ్ వరికూటి నాగరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తమినేని శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు యారవ శ్రీను, కేవీ ఎస్ గౌడ్, తిరుపాలు, తెలుగు మహిళలు పార్వతమ్మ, షేక్ వాజిదాబేగం, నీరజ తదితరులు పాల్గొన్నారు.
అలాగే, పట్టణంలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర శంకుస్థాపన చేశారు. రూ.35 లక్షలతో ఈపనులు చేపట్టినట్టు ఆయన పేర్కొ న్నారు. కనకపట్టణంలోని 5వ వార్డులో రూ.15 లక్షల తో, 8వ వార్డులో రూ.16 లక్షలతో, 7వ వార్డు కొత్తూరు లో రూ.4 లక్షలతో సిమెంట్ కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
విద్యారంగం అభివృద్ధే లక్ష్యం
నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ట్రి పుల్‌ఐటీ కళాశాల ఏర్పాటుకై మండలంలోని బల్లిపల్లి గ్రా మం వద్ద, పామూరు ప్రాం తంలోని దూబగుంట వద్ద ఉన్న భూములను గురువా రం పరిశీలించారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కనిగిరి ప్రాంతానికి మంజూరైన ట్రిపుల్‌ఐటీ గత పాలకుల నిర్లక్ష్యంతో ఒంగో లుకు తరలిందన్నారు. దీంతో కనిగిరి ప్రాంతం అభి వృద్ధికి విఘాతం ఏర్పడిందన్నారు. ఈసమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచే శారన్నారు. త్వరలో ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు జరిగి తీరు తుందన్నారు. అప్పటివరకు కనిగిరి ప్రాంతంలో అను వైన భవనాన్ని పరిశీలించి ఈ ఏడాది నుంచే తరగతు లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కా ర్యక్రమంలో ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ భాస్కర్‌పటేల్, తహసీ ల్దార్ రవిశంకర్, రెవెన్యూ సిబ్బంది, టీడీపీ మండల కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, తమ్మినేని శ్రీనివాసు లురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 10:42 PM