ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొప్పోలులో 28 నుంచి నాటిక పోటీలు

ABN, Publish Date - May 24 , 2025 | 12:41 AM

కొప్పోలులో ఈ నెల 28వ తేదీ నుంచి కొప్పోలు కల్చరల్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియే షన్‌ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు.

బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు కల్చరల్‌, మే 23(ఆంధ్రజ్యోతి): కొప్పోలులో ఈ నెల 28వ తేదీ నుంచి కొప్పోలు కల్చరల్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియే షన్‌ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఒంగోలు లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ శుక్రవారం ఆ విష్కరించారు. ఈ సందర్భంగా రఘుపతి మా ట్లాడుతూ కొప్పోలు కళాపరిషత్‌ 7వ వార్షికోత్స వం, నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఈనెల 28 నుంచి వచ్చే 1వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 8 నుంచి 12 గంటల వరకు నాటిక పోటీలు నిర్వహించటానికి ఏర్పా ట్లు చేశామన్నారు. ఈ పోటీలను వీక్షించటానికి వచ్చే మహిళలకు చీరలు బహుమతిగా ఇవ్వను న్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రముఖ రంగస్థల నటి సురభి ప్రభావతిని సన్మానించ నున్నట్లు చెప్పారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పారా రమేష్‌ మాట్లాడుతూ పోటీలలో పాల్గొన టానికి వచ్చే కళాకారులకు అన్ని వసతి సౌకర్యా లు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో లైవ్‌స్టాక్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, అసోసియే షన్‌ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ సాదినేని సురేష్‌ బాబు, ప్రధానకార్యదర్శి ఈదర బలరామయ్య, కోశాధికారి తాటిపర్తి పుల్లారెడ్డి, కార్యదర్శి దాస రి జయరావు, ఉన్నం నరసింహారావు, దివి రమే ష్‌, గద్దల శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:41 AM