ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులను తిప్పుకోవద్దు

ABN, Publish Date - Apr 09 , 2025 | 11:17 PM

భూసమస్యలపై రైతులను తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు.

అర్జీలు స్వీకరిస్తున్న ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, అధికారులు

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు

ప్రజాదర్బార్‌కు 200 అర్జీలు

పుల్లలచెరువు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి) : భూసమస్యలపై రైతులను తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు. బుధవారం పుల్లలచెరువులో ప్రజాదర్చార్‌ సభకు ఆయన హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం జిల్లాలోనే వెనుకబడి ఉందన్నారు. భూముల ఆన్‌లైన్‌ కోసం పేద రైతులను కార్యాలయాల చుట్టూ అధికారులు తిప్పుకోకుండా పనిచేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని చెప్పారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా అధికారులు ప్రణాళికలు తయారు చేసి సమర్థంగా అమలు చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డులు నిర్మించామన్నారు. మండలంలో తహసీల్దార్‌ లేక రైతులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం 200 అర్జీలు రాగా అందులో 70 అర్జీలు రెవెన్యూ సమస్యలపై అందినట్లు ఇన్‌చార్జ్జి ఎంపీడీవో బండారు శ్రీనివాసరావు చెప్పారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దారు చిరంజీవీ, ఎంపీపీ వెంకటయ్య, ఏపీఏం నూనె వెంకటయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌, టీడీపీ నాయకులు కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, శనగా నారాయణరెడ్డి, గజ్వేల్లి భాస్కర్‌, కె కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:17 PM