కాకమ్మ కథలు చెప్పొద్దు
ABN, Publish Date - Jul 22 , 2025 | 11:20 PM
ప్రతి సమస్యకూ కాకమ్మ కథ లు చెబుతూ తప్పించుకోవద్దని అధికా రులు, సిబ్బందిపై కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పె దఉల్లగల్లు గ్రామాలను ఆమె సందర్శించారు.
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
పూరిమెట్ల, కెల్లంపల్లి, పెదఉల్లగల్లు గ్రామాల సందర్శన
ముండ్లమూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : ప్రతి సమస్యకూ కాకమ్మ కథ లు చెబుతూ తప్పించుకోవద్దని అధికా రులు, సిబ్బందిపై కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పె దఉల్లగల్లు గ్రామాలను ఆమె సందర్శించారు. పూరిమెట్ల గ్రామంలో పలువురు పేదలను పీ-4 పథకం గురించి కలెక్టర్ ప్రశ్నించగా చెప్పలేకపోయారు. పంచాయతీ సెక్రటరీని అడగ్గా సరైన సమాధానం చెప్పలేకపోవడంతో ఆమె ఆగ్ర హం వ్యక్తం చేశారు. మరలా గ్రామసభ నిర్వహించి ప్రజలకు పీ 4 పథకంపై అర్థమయ్యే విధంగా వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఓ ఇంటికి వెళ్లి పలుకరించగా తమకు వా రం రోజుల నుంచి చికున్‌గున్యా వ్యాధి వచ్చిందని, వైద్యులు పట్టించుకోలేదని తెలిపారు. ఆగ్రహం చెందిన కలెక్టర్ వై ద్యాధికారులు, ఏఎన్‌ఎంలు ఎక్కడ ఉన్నారని అడగ్గా తాము మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటామని తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించారా? అని ఏఎన్‌ఎం రమణను అడగ్గా తాను నిన్ననే విధుల్లో చేరానని తెలిపారు. ఎంపీడీవో శ్రీదేవిని అడగ్గా నేను కూడా కొత్తగా వచ్చానన్నారు. కథలు చెప్పి తప్పించు కోవద్దు, బాధ్యతగా ఉండాలని, పదేపదే మేము కొత్త మేము కొత్త అని చెప్పటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకురాగా, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హనుమాన్ బాబును ప్రశ్నించగా, దర్శి నుంచి ఎన్‌ఏపీ నీరు సరఫరా అవుతోందని తెలిపారు. పైపులు పగిలిపోతుండటంతో తాగునీటి సమస్య ఏర్పడుతుందని ఏఈ వివరించారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కెల్లంపల్లిలో గ్రామంలో ప్రధాన వీధులను కలెక్టర్ సందర్శించి పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పూరిమెట్లలో బెల్టు షాపులతో కాపురాలు చితికి పోతున్నాయని గ్రామానికి చెందిన ముల్లా విజయమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
పేదరికంలేని సమాజ స్థాపనే ప్రభుత్వ ధ్యేయం
పేదరికం లేని సమాజ స్థాపనే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. మండలంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పెదఉల్లగల్లు గ్రామాలను సందర్శించారు. ఐవీఆర్‌ఎస్ సర్వేలో భాగంగా పారిశుధ్యం సరిగా లేదని ఫిర్యాదులు రావటంతో పూరిమెట్ల, కెల్లంపల్లి గ్రామాలను సందర్శించామని, పారిశుధ్యం అధ్వానంగా ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. ఇటీవల పీ-4 పథకంపై గ్రామసభలు పెట్టి గ్రామాల్లో పేదలను గుర్తించినట్టు చెప్పారు. కేవలం గ్రామాల్లో ఉండే స్థితిమంతులే కాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారు, వివిధ రంగాల్లో స్థిరపడినవారు ముందుకు రావాలని కోరారు.
Updated Date - Jul 22 , 2025 | 11:20 PM