ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దు
ABN, Publish Date - May 05 , 2025 | 10:14 PM
నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు సాయంత్రం 5 నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని మార్కాపురం డిప్యూటీ రేంజర్ ప్రసాద్‌రెడ్డి సూచించారు.
పెద్దపులి పాదముద్రలను పరిశీలిస్తున్న ఫారెస్టు అధికారులు
కంభం, మే 5 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు సాయంత్రం 5 నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని మార్కాపురం డిప్యూటీ రేంజర్ ప్రసాద్‌రెడ్డి సూచించారు. అర్ధవీడు మండలంలో గత 3 నెలలుగా పలు ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తూ పశువులను చంపుతున్నదని తెలిపారు. ఆయా ప్రాంతాలలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్దపులి పాదముద్రలను అటవీ సిబ్బంది సేకరించినట్లు ఆయన తెలిపారు.
Updated Date - May 05 , 2025 | 10:14 PM